News May 15, 2024
‘న్యూస్ క్లిక్’ ప్రబీర్ విడుదలకు సుప్రీం ఆదేశాలు
UAPA కేసులో జైలులో ఉన్న న్యూస్ క్లిక్ వ్యవస్థాపకుడు ప్రబీర్ పుర్కాయస్థను విడుదల చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. అతడి అరెస్టు, రిమాండ్ చట్టవిరుద్ధమని పేర్కొంది. ప్రబీర్.. చైనా నుంచి నిధులు అందుకొని.. ఆ దేశ అనుకూల ప్రచారం చేస్తున్నారని 2023 ఆగస్టులో ‘న్యూయార్క్ టైమ్స్’లో కథనం ప్రచురితం అయింది. దీంతో చట్టవ్యతిరేక కార్యకలాపాల నివారణ చట్టం(UAPA) కింద కేసు నమోదైంది.
Similar News
News January 11, 2025
రాష్ట్రంలో ‘వన్ స్టేట్-వన్ రేషన్’ విధానం: సీఎం
TG: రాష్ట్రంలో ‘వన్ స్టేట్-వన్ రేషన్’ విధానాన్ని అమలు చేయబోతున్నామని సీఎం రేవంత్ ప్రకటించారు. రాష్ట్రంలో ఒకరికి ఒకచోట మాత్రమే రేషన్ కార్డు ఉండాలన్నారు. ఈ నెల 11 నుంచి 15వ తేదీలోగా పథకాల అమలుకు కావలసిన ప్రిపరేటరీ పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డు లబ్ధిదారుల జాబితాలనూ గ్రామ సభల్లో బహిర్గతం చేయాలని, ఈనెల 24లోగా గ్రామ సభలు పూర్తి చేయాలని ఆదేశించారు.
News January 11, 2025
ALERT.. పెరగనున్న చలి తీవ్రత
TG: బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం మరో 4 రోజులు కొనసాగనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో చలి తీవ్రత మరింత పెరగనున్నట్లు తెలిపింది. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 10 డిగ్రీలకు దిగువన నమోదవుతున్నాయని పేర్కొంది. కొమురం భీం(D) తిర్యాణీలో 6.8, ఆదిలాబాద్(D) భీంపూర్‌లో 7, నిర్మల్(D) పెంబీలో 9.1, సంగారెడ్డి(D) న్యాల్‌కల్‌లో 9.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు తెలిపింది.
News January 11, 2025
అదనపు ఛార్జీలు వసూలు చేస్తే బస్సు సీజ్: పొన్నం
TG: సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికుల వద్ద ప్రైవేటు ట్రావెల్స్ ఎక్స్‌ట్రా ఛార్జీలు వసూలు చేస్తే బస్సులు సీజ్ చేస్తామని మంత్రి పొన్నం హెచ్చరించారు. అదనపు ఛార్జీల పేరిట ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రైవేటు బస్సులు ఎక్స్‌ట్రా ఛార్జీలు అడిగితే ప్రయాణికులు రవాణా శాఖ దృష్టికి తేవాలని మంత్రి సూచించారు. ఆర్టీసీ అధికారులు డిపోల వద్ద తనిఖీలు చేయాలని ఆదేశించారు.