News January 11, 2025
రాష్ట్రంలో ‘వన్ స్టేట్-వన్ రేషన్’ విధానం: సీఎం
TG: రాష్ట్రంలో ‘వన్ స్టేట్-వన్ రేషన్’ విధానాన్ని అమలు చేయబోతున్నామని సీఎం రేవంత్ ప్రకటించారు. రాష్ట్రంలో ఒకరికి ఒకచోట మాత్రమే రేషన్ కార్డు ఉండాలన్నారు. ఈ నెల 11 నుంచి 15వ తేదీలోగా పథకాల అమలుకు కావలసిన ప్రిపరేటరీ పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డు లబ్ధిదారుల జాబితాలనూ గ్రామ సభల్లో బహిర్గతం చేయాలని, ఈనెల 24లోగా గ్రామ సభలు పూర్తి చేయాలని ఆదేశించారు.
Similar News
News January 20, 2025
ఇన్ఫోసిస్‌లో జీతాలే పెరగవు.. మాజీ ఉద్యోగి పోస్ట్ వైరల్
ఇన్ఫోసిస్‌లో శాలరీ హైక్ చాలా తక్కువని సంస్థ మాజీ ఉద్యోగి తెలిపారు. 9 ఏళ్లు పనిచేసి 2017లో రిజైన్ చేసేనాటికి తన జీతం రూ.35 వేలు మాత్రమేనన్నారు. వేరే టెక్ కంపెనీలో చేరగా 4 ఏళ్లలో నెల వేతనం రూ.1.75 లక్షలకు చేరిందని చెప్పుకొచ్చారు. క్యాబ్, పార్కింగ్ వంటి సదుపాయాలు కూడా ఇన్ఫోసిస్‌లో ఉండేవి కావన్నారు. ప్రస్తుత కంపెనీలో ఎన్నో సౌకర్యాలు ఉన్నాయని రెడిట్‌లో ఆయన చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.
News January 19, 2025
రేషన్ కార్డులపై కీలక ప్రకటన
TG: అర్హత కలిగిన ప్రతి కుటుంబానికీ పారదర్శకంగా రేషన్ కార్డులు ఇస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. ఇందుకోసం ఇంకా ఎలాంటి జాబితా రెడీ కాలేదని తెలిపారు. ఖమ్మం(D) బనిగండ్లపాడులో మాట్లాడుతూ ఏ లిస్టు అయినా గ్రామ సభల్లోనే తయారవుతుందని స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎలాంటి వదంతులూ నమ్మొద్దన్నారు. అలాగే వ్యవసాయ యోగ్యమైన భూములకు షరతులు లేకుండా ఎకరానికి రూ.12వేలు ఇస్తామని పునరుద్ఘాటించారు.
News January 19, 2025
టిక్‌టాక్‌పై నిషేధం.. ట్రంప్ కీలక ప్రకటన
అమెరికాలో టిక్‌టాక్ యాప్ బ్యాన్‌పై డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. తమ దేశంలోని ఇన్వెస్టర్లు అందులో 50శాతం వాటా పొందేందుకు అనుమతి ఇస్తే ఆ యాప్‌పై బ్యాన్ ఎత్తివేస్తామని ప్రకటించారు. కాగా మరికొన్ని గంటల్లో ట్రంప్ US అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇక ఈ యాప్ US యూజర్ల డేటాను చైనా ప్రభుత్వానికి చేరవేస్తోందంటూ అక్కడి సుప్రీంకోర్టు <<15193540>>టిక్‌టాక్‌ను<<>> నిషేధించిన విషయం తెలిసిందే.