News May 15, 2024

మణిపుర్ హింసతో నిరాశ్రయులుగా 67వేల మంది: IDMC

image

గత ఏడాది జరిగిన మణిపుర్‌ హింసలో 67వేల మంది నిరాశ్రయులైనట్లు ఇంటర్నల్ డిస్‌ప్లేస్‌మెంట్ మానిటరింగ్ సెంటర్ వెల్లడించింది. 2018 తర్వాత అల్లర్ల కారణంగా దేశంలో ఈ స్థాయిలో నిరాశ్రయులు కావడం ఇదే తొలిసారని పేర్కొంది. నిరాశ్రయుల్లో కొందరు నాగాలాండ్, అస్సాం, మిజోరం రాష్ట్రాలకు వలస వెళ్లినట్లు తెలిపింది. ఇక దేశవ్యాప్తంగా వరదలు, భూకంపాలు వంటి విపత్తులతో మరో 5.28లక్షల మంది నిరాశ్రయులు అయినట్లు తెలిపింది.

Similar News

News January 11, 2025

నేడు కర్నూలు జిల్లాలో Dy.CM పవన్ పర్యటన

image

AP: Dy.CM పవన్ నేడు కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. పిన్నాపురం గ్రీన్ కో ప్రాజెక్టును ఆయన పరిశీలించనున్నట్లు అధికారులు తెలిపారు. ఉదయం 11.30 గంటలకు ప్రత్యేక విమానంలో కర్నూలు చేరుకుంటారు. అనంతరం హెలికాప్టర్‌లో ప్రాజెక్టులోని సౌర విద్యుత్, హైడల్ పవర్‌ ప్లాంట్‌లను ఏరియల్ వ్యూ చేయనున్నారు. అనంతరం రోడ్డు మార్గాన ప్రాజెక్టును సందర్శిస్తారు. సాయంత్రం 4.50గం.కు కర్నూలు నుంచి ఆయన తిరుగుపయనం అవుతారు.

News January 11, 2025

పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్స్: కొత్త రూల్స్ ఇవే

image

TG: వచ్చే విద్యా సంవత్సరంలో SC విద్యార్థుల పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్‌లకు సంబంధించి ప్రభుత్వం కొత్త నిబంధనలు జారీ చేసింది.
☛ విద్యార్థుల పేరు ఆధార్, టెన్త్ మెమోలో ఒకేలా ఉండాలి
☛ మీ సేవ కేంద్రాల్లో విద్యార్థులు బయోమెట్రిక్ పూర్తిచేయాలి
☛ తర్వాత ఈ-పాస్‌ <>సైట్‌లో<<>> రిజిస్టర్ చేసుకోవాలి
☛ బ్యాంక్ ఖాతాను ఆధార్‌తో లింక్ చేయాలి
☛ కాలేజీ యాజమాన్యాలే విద్యార్థుల అప్లికేషన్లను పరిశీలించి అధికారులకు పంపాలి

News January 11, 2025

రాష్ట్రంలో ‘వన్ స్టేట్-వన్ రేషన్’ విధానం: సీఎం

image

TG: రాష్ట్రంలో ‘వన్ స్టేట్-వన్ రేషన్’ విధానాన్ని అమలు చేయబోతున్నామని సీఎం రేవంత్ ప్రకటించారు. రాష్ట్రంలో ఒకరికి ఒకచోట మాత్రమే రేషన్ కార్డు ఉండాలన్నారు. ఈ నెల 11 నుంచి 15వ తేదీలోగా పథకాల అమలుకు కావలసిన ప్రిపరేటరీ పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డు లబ్ధిదారుల జాబితాలనూ గ్రామ సభల్లో బహిర్గతం చేయాలని, ఈనెల 24లోగా గ్రామ సభలు పూర్తి చేయాలని ఆదేశించారు.