News May 16, 2024
పర్పుల్ పటేల్ మళ్లీ.. టాప్5లో అంతా మనోళ్లే..
2021లో 32 వికెట్లు తీసిన పర్పుల్ పటేల్‌గా పేరు తెచ్చుకున్న హర్షల్ పటేల్ మళ్లీ బౌలింగ్‌లో టాప్-1లోకి వచ్చారు. 13 మ్యాచుల్లో 22 వికెట్లు తీసిన ఈ పంజాబ్ కింగ్ పర్పుల్ క్యాప్ సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత ముంబై ఇండియన్స్ స్పీడ్ గన్ జస్ప్రీత్ బుమ్రా (20 వికెట్లు), KKR మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి(18), RR లెగ్ స్పిన్నర్ చాహల్(17), ఢిల్లీ పేసర్ ఖలీల్ అహ్మద్(17) టాప్5లో ఉన్నారు.
Similar News
News January 9, 2025
తిరుపతి తొక్కిసలాట: మృతులకు రూ.25 లక్షల పరిహారం
తిరుపతి తొక్కిసలాటలో మరణించిన మృతుల కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. రూ.25 లక్షల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ఈ ఘటనలో ఆరుగురు మరణించగా, 40 మంది గాయపడ్డారు.
News January 9, 2025
కేటీఆర్ క్వాష్ పిటిషన్.. తక్షణ విచారణకు SC నో
TG: ఫార్ములా-ఈ రేసు కేసులో కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను రేపు విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ నెల 15న విచారిస్తామని తెలిపింది. అత్యవసరంగా తమ పిటిషన్‌ను విచారణ చేయాలని కోరగా కోర్టు అనుమతించలేదు. ఈ నెల 15న లిస్ట్ అయినందున అదే రోజు విచారిస్తామని స్పష్టం చేసింది. కాగా, హైకోర్టు క్వాష్ పిటిషన్‌ను కొట్టివేయడంతో కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.
News January 9, 2025
జగన్ లండన్ టూర్‌కు కోర్టు అనుమతి
AP: మాజీ సీఎం వైఎస్ జగన్ లండన్ పర్యటనకు సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ నెల 11 నుంచి 30 వరకు ఆయన యూకేలో పర్యటించేందుకు అనుమతులు జారీ చేసింది. కాగా తన కుమార్తె గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు తన లండన్ పర్యటనకు అనుమతించాలని జగన్ కోర్టును కోరారు.