News January 9, 2025
కేటీఆర్ క్వాష్ పిటిషన్.. తక్షణ విచారణకు SC నో
TG: ఫార్ములా-ఈ రేసు కేసులో కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను రేపు విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ నెల 15న విచారిస్తామని తెలిపింది. అత్యవసరంగా తమ పిటిషన్‌ను విచారణ చేయాలని కోరగా కోర్టు అనుమతించలేదు. ఈ నెల 15న లిస్ట్ అయినందున అదే రోజు విచారిస్తామని స్పష్టం చేసింది. కాగా, హైకోర్టు క్వాష్ పిటిషన్‌ను కొట్టివేయడంతో కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.
Similar News
News January 18, 2025
విజయవాడకు అమిత్ షా.. కాసేపట్లో చంద్రబాబు నివాసంలో డిన్నర్
AP: కేంద్ర హోంమంత్రి అమిత్ షా విజయవాడకు చేరుకున్నారు. గన్నవరం ఎయిర్‌పోర్టులో ఆయనకు మంత్రులు లోకేశ్, అనితతో పాటు 13 మంది కూటమి నేతలు స్వాగతం పలికారు. కాసేపట్లో షా ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసంలో డిన్నర్ చేస్తారు. రాత్రికి ప్రైవేట్ హోటల్‌లో బస చేసే ఆయన రేపు నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ 10వ బెటాలియన్ కార్యాలయం కొత్త క్యాంపస్‌ను ప్రారంభిస్తారు.
News January 18, 2025
సైఫ్ అలీ ఖాన్‌కు రూ.25 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్!
కత్తి దాడి నుంచి బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కోలుకుంటున్నారు. వైద్య ఖర్చులకు గాను ఆయన Niva Bupaలో రూ.35.95 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసినట్లు ఓ డాక్యుమెంట్ బయటికొచ్చింది. రూ.25 లక్షలు అప్రూవ్ చేసినట్లు అందులో ఉంది. ఈ వార్తలపై కంపెనీ స్పందిస్తూ ఆయన ఫైనల్ బిల్లులు సమర్పించిన తర్వాత మొత్తాన్ని సెటిల్ చేస్తామని పేర్కొంది. ఎంత క్లెయిమ్ చేశారనేది అధికారికంగా తెలపలేదు.
News January 18, 2025
మహాకుంభమేళా: రోజూ లక్ష మంది ఆకలి తీరుస్తున్న ఇస్కాన్
మహాకుంభమేళాలో భక్తులు, వర్కర్ల ఆకలి తీర్చేందుకు ఇస్కాన్-అదానీ గ్రూప్ చేతులు కలిపాయి. రోజూ దాదాపు లక్ష మందికి ఆహారాన్ని అందిస్తున్నాయి. ఇందులో దాల్, చోలే/రాజ్మా, వెజిటబుల్ కర్రీ, రోటీ, రైస్‌తోపాటు హల్వా/బూందీ లడ్డూ ఉన్నాయి. పిడకలతో మట్టి పొయ్యిపై ఈ ఫుడ్‌ను వండటం మరో విశేషం. 100 వాహనాల ద్వారా ప్రయాగ్‌రాజ్‌లోని మొత్తం 40 ప్రాంతాల్లో ఆహారాన్ని సరఫరా చేస్తున్నట్లు ఇస్కాన్ ప్రతినిధి చెప్పారు.