News May 16, 2024

కలవరం.. తగ్గిపోతున్న సంతానోత్పత్తి

image

ప్రపంచవ్యాప్తంగా సంతానోత్పత్తి రేటు 2021 నాటికి 2.4కి పడిపోయినట్లు పలు నివేదికలు పేర్కొన్నాయి. 1960లో ప్రపంచంలో సంతానోత్పత్తి రేటు 5గా ఉంది. భారత్‌లో 1950లో ఈ రేటు 6.18గా ఉంటే 2021 నాటికి 2కంటే తక్కువకు పడిపోయింది. మారిన వాతావరణ పరిస్థితులు, ఆహారపు అలవాట్లు, ఆలస్యంగా పెళ్లి, ఒత్తిడి వంటివి ఇందుకు కారణాలు. ఇదిలాగే కొనసాగితే ఉత్పాదక శక్తిపై ప్రభావం పడి దేశాల ఆర్థిక వ్యవస్థలు ఛిన్నాభిన్నమవుతాయి.

Similar News

News January 9, 2025

కాఫీ ఏ టైమ్‌లో తాగుతున్నారు?

image

రోజంతా కాకుండా కేవలం ఉదయం మాత్రమే కాఫీ తాగడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు మెండుగా ఉంటాయని తాజాగా చేసిన ఓ సర్వే పేర్కొంది. యూఎస్‌లోని తులనే యూనివర్సిటీలోని నిపుణుల బృందం దశాబ్దానికి పైగా చేసిన అధ్యయనంలో ఈ ఫలితాలను ప్రకటించింది. ఇతర సమయాల్లో కాఫీ తాగే వారితో పోలిస్తే ఉదయాన్నే తాగే వారిలో మరణాల రేటు తక్కువగా ఉన్నట్లు పేర్కొంది. సాయంత్రం కాఫీ తాగేవారిలో గుండె సమస్యలు తలెత్తే అవకాశం ఉందని వెల్లడించింది.

News January 9, 2025

బుమ్రా బంగారు బాతు.. చంపేయొద్దు: కైఫ్

image

భారత క్రికెట్‌కు బుమ్రా బంగారు బాతు వంటి ఆటగాడని, ఆ బాతును ఎక్కువగా వాడి చంపేయకూడదని మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ సూచించారు. ‘బుమ్రాను కెప్టెన్‌గా నియమించే ముందు బీసీసీఐ ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలి. కెప్టెన్సీ భారాన్ని వేరేవారికి వదిలేసి బుమ్రా కేవలం వికెట్లు తీయడంపై దృష్టి సారించేలా చూడాలి. లేదంటే ఆ ఒత్తిడి అతడికి కొత్త గాయాలను తీసుకొచ్చి మొదటికే మోసం రావొచ్చు’ అని ఆందోళన వ్యక్తం చేశారు.

News January 9, 2025

పిల్లలకు జన్మనిస్తే రూ.81,000.. యువతులకు ఆఫర్

image

రష్యాలో గత ఏడాది జననాలు తగ్గడంతో ఆ దేశంలోని కరేలియా యంత్రాంగం సంచలన ప్రకటన చేసింది. 25 ఏళ్ల లోపు యువతులు ఆరోగ్యకరమైన చిన్నారులకు జన్మనిస్తే రూ.81,000 ఇస్తామని ప్రకటించింది. కరేలియాకు చెందిన వారై స్థానికంగా చదివేవారిని అర్హులుగా పేర్కొంది. అయితే ఇప్పటికే పిల్లలున్న వారికి ఇది వర్తించదని తెలిపింది. ఇతర ప్రాంతాలు ఇదే విధానాన్ని అనుసరించే యోచనలో ఉన్నాయి.