News January 9, 2025

కాఫీ ఏ టైమ్‌లో తాగుతున్నారు?

image

రోజంతా కాకుండా కేవలం ఉదయం మాత్రమే కాఫీ తాగడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు మెండుగా ఉంటాయని తాజాగా చేసిన ఓ సర్వే పేర్కొంది. యూఎస్‌లోని తులనే యూనివర్సిటీలోని నిపుణుల బృందం దశాబ్దానికి పైగా చేసిన అధ్యయనంలో ఈ ఫలితాలను ప్రకటించింది. ఇతర సమయాల్లో కాఫీ తాగే వారితో పోలిస్తే ఉదయాన్నే తాగే వారిలో మరణాల రేటు తక్కువగా ఉన్నట్లు పేర్కొంది. సాయంత్రం కాఫీ తాగేవారిలో గుండె సమస్యలు తలెత్తే అవకాశం ఉందని వెల్లడించింది.

Similar News

News January 26, 2025

జాతీయ జెండా ఆవిష్కరించిన తెలుగు రాష్ట్రాల గవర్నర్లు

image

తెలుగు రాష్ట్రాల్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఏపీలో విజయవాడలోని ఇందిరా గాంధీ స్టేడియంలో గవర్నర్ అబ్దుల్ నజీర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, Dy.CM పవన్, మంత్రి లోకేశ్ తదితరులు పాల్గొన్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో TG గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ జెండాను ఎగురవేశారు. సీఎం రేవంత్, భట్టి విక్రమార్క సహా మంత్రులు పాల్గొన్నారు.

News January 26, 2025

మూడు చోట్ల కాలికి ఫ్రాక్చర్: రష్మిక

image

తన కాలికి మూడు చోట్ల ఫ్రాక్చర్ అయినట్లు హీరోయిన్ రష్మిక మందన్న తెలిపారు. కండరాల్లో చీలిక కూడా వచ్చినట్లు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. ‘2 వారాలుగా కనీసం నడవలేకపోతున్నా. ఎక్కడికి వెళ్లినా ఒంటి కాలిపైనే వెళ్తున్నా. నాపై మీరు చూపించే ప్రేమ, అభిమానం వల్లే నాకు ఈ నొప్పి తెలియడం లేదు. నాకు మద్దతుగా నిలిచినవారికి రుణపడి ఉంటా’ అని పేర్కొన్నారు. కాగా రష్మిక నటించిన ‘ఛావా’ మూవీ FEB 14న రిలీజ్ కానుంది.

News January 26, 2025

అక్కడ ఈ తరంలో తొలిసారి జెండా ఎగురుతోంది

image

ఛత్తీస్‌గఢ్ బస్తర్‌లో రెండు దశాబ్దాలుగా జాతీయ జెండా ఎగరలేదు. ఆ ప్రాంతం మావోల కీలక నేత హిడ్మా నేతృత్వంలోని PLGA బెటాలియన్ 1 పరిధిలోనిది. ఇరవై ఏళ్లుగా చెప్పుకునేందుకు కూడా ప్రభుత్వ పాలన లేని అక్కడ భద్రతా బలగాలు ఇటీవల పట్టు సాధించాయి. ఫోర్సెస్ 14 క్యాంపులు నిర్వహిస్తున్నాయి. దీంతో 14 గ్రామాల్లో ఇవాళ గణతంత్ర వేడుకలు జరగనున్నాయి. బస్తర్ యువతరం తొలిసారి జెండావందనం చూడబోతుందని IG సుందర్ రాజ్ తెలిపారు.