News May 16, 2024

SRH ప్లే ఆఫ్స్ చేరదు: హర్భజన్

image

ఈ సారి SRH ప్లే ఆఫ్స్ చేరే అవకాశాలు లేవని మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ అభిప్రాయపడ్డారు. ‘తదుపరి 2 మ్యాచ్‌లలో SRH ఓడిపోవచ్చు. ఐపీఎల్‌లో ఏదైనా జరగొచ్చు. కేకేఆర్, రాజస్థాన్, సీఎస్కే, ఆర్సీబీ ప్లే ఆఫ్స్‌కు వెళ్లొచ్చు’ అని ఆయన చెప్పారు. కాగా హర్భజన్ వ్యాఖ్యలపై SRH ఫ్యాన్స్ మండిపడుతున్నారు. అపశకునపు మాటలు మాట్లాడుతున్నారంటూ భగ్గుమంటున్నారు. కమిన్స్ బృందాన్ని తక్కువ అంచనా వేస్తున్నారని ఫైర్ అవుతున్నారు.

Similar News

News January 11, 2025

అత్యధిక గంటలు పనిచేసేది ఈ దేశస్థులే..!

image

వారంలో 90 గంటలు పనిచేయాలంటూ L&T ఛైర్మన్ సుబ్రహ్మణ్యన్ వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. కాగా ప్రపంచంలోనే భూటాన్ దేశస్థులు అత్యధిక గంటలు పనిచేస్తున్నారు. వీరు వారానికి 54.4 గంటలు కష్టపడుతున్నారు. ఆ తర్వాత యూఏఈ-50.9 గంటలు, లీసోతో-50.4, కాంగో-48.6, ఖతర్-48, లైబీరియా-47.7, మారిటానియా-47.6, లెబనాన్-47.6, మంగోలియా-47.3, జోర్డాన్ దేశస్తులు 47 గంటలు. ఇండియాలో 48 గంటలు పని చేస్తున్నారు.

News January 11, 2025

‘సంక్రాంతి బంపర్ ఆఫర్.. ఉచిత రీచార్జ్’ అని మెసేజ్ వచ్చిందా?

image

సైబర్ నేరగాళ్లు పండుగ సమయాన్ని తమ మోసాలకు కొత్త ఎత్తుగడగా ఎంచుకున్నట్లు తెలంగాణ పోలీసులు గుర్తించారు. ‘పండుగ సందర్భంగా బంపర్ ఆఫర్ అని ఉచిత రీచార్జ్ అంటూ మెసేజ్‌లు పంపుతారు. వాటిని నమ్మకండి. ఆశపడి క్లిక్ చేయొద్దు. లింక్ మరో 10 మందికి షేర్ చేయకండి. అది రీచార్జ్ కాదు.. మాల్‌వేర్. అత్యాశకు వెళ్లి సైబర్ మోసాలకు గురికావొద్దు’ అని Xలో పోలీసులు ప్రకటన చేశారు.

News January 11, 2025

జైలుకు తెలుగు యూట్యూబర్

image

AP: తెలుగు యూట్యూబర్ ఫన్ బకెట్ <<15118839>>భార్గవ్‌ను <<>>పోలీసులు విశాఖ సెంట్రల్ జైలుకు తరలించారు. మైనర్ బాలికపై లైంగిక దాడి కేసులో కోర్టు అతడికి 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. దీంతో పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తీసుకెళ్లారు. ఈ కేసులో 25 మంది సాక్షులను విచారించిన పోలీసులు, 17 మందితో సాక్ష్యం చెప్పించారు. ఈ తీర్పుపై భార్గవ్ అప్పీల్‌కు వెళ్లినా పైకోర్టు స్వీకరించదని పోక్సో కోర్టు స్పెషల్ PP మూర్తి వెల్లడించారు.