News January 11, 2025
జైలుకు తెలుగు యూట్యూబర్
AP: తెలుగు యూట్యూబర్ ఫన్ బకెట్ <<15118839>>భార్గవ్‌ను <<>>పోలీసులు విశాఖ సెంట్రల్ జైలుకు తరలించారు. మైనర్ బాలికపై లైంగిక దాడి కేసులో కోర్టు అతడికి 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. దీంతో పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తీసుకెళ్లారు. ఈ కేసులో 25 మంది సాక్షులను విచారించిన పోలీసులు, 17 మందితో సాక్ష్యం చెప్పించారు. ఈ తీర్పుపై భార్గవ్ అప్పీల్‌కు వెళ్లినా పైకోర్టు స్వీకరించదని పోక్సో కోర్టు స్పెషల్ PP మూర్తి వెల్లడించారు.
Similar News
News January 21, 2025
ఒకే చోట రూ.82 లక్షల కోట్లు
ట్రంప్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న కుబేరులు హాజరైన విషయం తెలిసిందే. ఈ వేడుకలో మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్, అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్, టెస్లా అధినేత ఎలోన్ మస్క్ ఒకే దగ్గర నిలబడ్డారు. ఈ నలుగురి నికర ఆదాయం $950 billion+గా ఉంది. అంటే అక్షరాలా రూ.82లక్షల కోట్లు. ప్రస్తుతం ఎలాన్ మస్క్ $433 బిలియన్లతో ప్రపంచ కుబేరుడిగా ఉన్నారు.
News January 21, 2025
టీమ్ ఇండియా జెర్సీలో మహ్మద్ షమీ
స్టార్ పేసర్ మహ్మద్ షమీ చాన్నాళ్ల తర్వాత టీమ్ ఇండియా జెర్సీ ధరించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇంగ్లండ్‌తో జరగబోయే టీ20 సిరీస్‌కు షమీ ఎంపికైన సంగతి తెలిసిందే. కాగా 2023 వన్డే వరల్డ్ కప్ తర్వాత షమీ అంతర్జాతీయ మ్యాచులకు దూరమయ్యారు. కాలి గాయంతో బాధపడుతూ ఆయన దాదాపు ఏడాదిన్నరపాటు జట్టుకు దూరంగా ఉన్నారు.
News January 21, 2025
కాంగ్రెస్ ‘జైబాపూ’ ఈవెంట్లో ఫ్రీడమ్ ఫైటర్స్‌కు అవమానం
కర్ణాటక బెలగావిలో ఫ్రీడమ్ ఫైటర్స్‌కు ఘోర అవమానం జరిగింది. గౌరవిస్తామని జై బాపూ ఈవెంట్‌కు కాంగ్రెస్ వారిని ఆహ్వానించింది. తీరా వచ్చాక వారినెవరూ కన్నెత్తి చూడలేదు. ఐడీ కార్డులు ఇవ్వకపోవడంతో పోలీసులు లోపలికి రానివ్వలేదు. దాంతో 92 ఏళ్ల ఆ వృద్ధులు బాంక్వెట్ హాల్ మెట్లమీదే పడిగాపులు పడ్డారు. నీళ్లు, ఆహారం లేక అలమటించారు. రానంటున్నా పిలిచి అవమానించారని ఆవేదన చెందారు. మీడియా కలగజేసుకొని వారికి సాయపడింది.