News May 17, 2024

అలాంటి సందర్భంలో నిందితుడిని ED అరెస్ట్ చేయరాదు: సుప్రీంకోర్టు

image

మనీలాండరింగ్ కేసు ప్రత్యేక కోర్టు పరిశీలనలో ఉన్నప్పుడు నిందితుడిని ED అరెస్ట్ చేయరాదని SC తెలిపింది. సమన్లు పొందిన వ్యక్తి కోర్టు ముందు హాజరు కావడాన్ని కస్టడీలో ఉన్నట్లు భావించలేమంది. అతడిని ED కస్టడీలోకి తీసుకోవాలంటే కోర్టు అనుమతి తప్పనిసరి అని పేర్కొంది. ఇలాంటి కేసులు కోర్టు పరిశీలనలో ఉన్నప్పుడు నిందితుడికి PMLA సెక్షన్ 45లోని 2 నిబంధనలు వర్తిస్తాయా అనే పిటిషన్‌పై SC ఈ విధంగా తీర్పిచ్చింది.

Similar News

News January 12, 2025

కేజ్రీవాల్‌కు అమిత్ షా కౌంటర్

image

రమేశ్ బిధూరీని బీజేపీ సీఎంగా అభ్యర్థిగా ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ పేర్కొనడంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కౌంటర్ ఎటాక్ చేశారు. ‘బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిని కేజ్రీవాల్ నిర్ణయిస్తారా? అలాంటి వ్యాఖ్యలు చేసేందుకు ఆయన ఎవరు?’ అని షా ప్రశ్నించారు. కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన రమేశ్ ఇటీవల దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే.

News January 12, 2025

80 మంది విద్యార్థినుల చొక్కాలు విప్పించిన ప్రిన్సిపల్

image

ఝార్ఖండ్‌లో ఓ ప్రైవేట్ పాఠశాలలో దారుణం చోటుచేసుకుంది. ఓ ప్రిన్సిపల్ 80 మంది విద్యార్థినుల చొక్కాలను విప్పి ఇంటికి పంపారు. ధన్‌బాద్ జిల్లాలోని ఓ ప్రైవేట్ స్కూల్‌లో టెన్త్ పరీక్షలు ముగియడంతో విద్యార్థినులు ‘పెన్ డే’ నిర్వహించారు. ఒకరి చొక్కాలపై మరొకరు సంతకం చేసుకున్నారు. ఇది చూసిన ప్రిన్సిపల్ వారి చొక్కాలను విప్పించారు. బ్లేజర్లతోనే విద్యార్థినులను ఇంటికి పంపారు. దీనిపై పోలీసుల విచారణ జరుగుతోంది.

News January 12, 2025

జనవరి 12: చరిత్రలో ఈ రోజు

image

1863: తత్వవేత్త స్వామి వివేకానంద జననం
1895: యల్లాప్రగడ సుబ్బారావు జననం
1962: రిచీ రిచర్డ్‌సన్ జననం
1991: హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ జననం
1991: చెస్ క్రీడాకారిణి ద్రోణవల్లి హారిక జననం
2005: సినీ నటుడు అమ్రీష్ పురి మరణం
2015: సినీ నిర్మాత, దర్శకుడు వి.బి.రాజేంద్రప్రసాద్ మరణం
* జాతీయ యువజన దినోత్సవం