News May 17, 2024
ఎఫ్‌డీఐకి, ఎఫ్ఐఐకి తేడా ఏంటి?
దేశంలో FDIలు పెరుగుతున్నాయని, FIIలు తగ్గుతున్నాయని ఇటీవల వార్తల్లో చూస్తున్నాం. రెండూ విదేశీ పెట్టుబడులకు సంబంధించినవే అయినా స్వల్ప తేడా ఉంది. విదేశాలకు చెందిన ఓ వ్యక్తి/సంస్థ మన దేశంలో వ్యాపారం ప్రారంభించడం లేదా ఆస్తులను కొంటే అది విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి (FDI) అవుతుంది. విదేశీ సంస్థాగత పెట్టుబడులు ఇందుకు భిన్నం. విదేశీ సంస్థలు మన దేశ స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టడాన్ని FII అంటారు.
Similar News
News December 22, 2024
భద్రతను కుదించుకున్న చంద్రబాబు
AP: CM చంద్రబాబు తన భద్రతను కుదించుకున్నారు. సిబ్బంది స్థానంలో టెక్నాలజీని వినియోగించాలని ఆయన నిర్ణయం తీసుకున్నారు. ఉండవల్లిలోని CM నివాసంలో సిబ్బందికి బదులు డ్రోన్‌తో పహారా కాయనున్నారు. ఇది కొత్తగా, అనుమానాస్పదంగా ఏది కనిపించినా వెంటనే మానిటరింగ్ టీమ్‌కు సమాచారం చేరవేస్తుంది. దానికి కేటాయించిన డక్‌పై అదే ఛార్జింగ్ పెట్టుకుంటుంది. చంద్రబాబుకు ప్రస్తుతం 121 మంది భద్రత కల్పిస్తున్నట్లు సమాచారం.
News December 22, 2024
‘పీలింగ్స్’ సాంగ్‌లో నటించేందుకు ఇబ్బంది పడ్డా: రష్మిక మందన్న
అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2’ మూవీలోని ‘పీలింగ్స్’ సాంగ్‌లో నటించేందుకు తొలుత ఇబ్బంది పడ్డానని హీరోయిన్ రష్మిక మందన్న తెలిపారు. ‘పుష్ప 2 సినిమా విడుదలకు కొన్ని రోజుల ముందే పీలింగ్స్ సాంగ్ షూటింగ్ ప్రారంభించాం. ఎవరైనా నన్ను ఎత్తుకుంటే నాకు భయం. అల్లు అర్జున్ నన్ను ఎత్తుకుని డాన్స్ చేశారు. ముందు కొంచెం భయంగా, అసౌకర్యంగా అనిపించింది. కానీ డైరెక్టర్ చెప్పినట్లు చేసేశా’ అని ఆమె చెప్పుకొచ్చారు.
News December 22, 2024
GST నిర్ణయాలు: ధర పెరిగేవి, తగ్గేవి ఇవే
ధరలు తగ్గేవి: ప‌్రజా పంపిణీ వ్యవస్థలో ఫోర్టిఫైడ్ బియ్యం పంపిణీ *జన్యు చికిత్సలకు చేసే జీన్ థెరపీ *ప్రభుత్వ పథకాల కింద ఆహార పంపిణీకి వాడే ముడి సరుకులు *రైతులు నేరుగా విక్రయించే మిరియాలు, ఎండుద్రాక్షపై నో GST. ధరలు పెరిగేవి: పాత వాహనాల అమ్మకాలు *రెడీ2ఈట్ పాప్‌కార్న్ *కార్పొరేట్ స్పాన్సర్‌షిప్ సేవలు *ఆటోక్లేవ్డ్ ఎరేటెడ్ కాంక్రీట్ బ్లాక్స్‌లో 50+% ఫ్లై యాష్ ఉంటే అధిక GST.