News May 17, 2024
అత్యధిక ఆదాయం పొందుతున్న అథ్లెట్లు వీరే.. కోహ్లీకి నో ఛాన్స్
అత్యధికంగా సంపాదిస్తున్న అథ్లెట్ల ఫోర్బ్స్-24 జాబితాలో ఫుట్‌బాల్ స్టార్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో అగ్ర స్థానంలో నిలిచారు. ఏడాదికి ఆయన $260 మిలియన్లు సంపాదిస్తున్నారు. ఈ జాబితాలో కోహ్లీకి స్థానం దక్కలేదు. టాప్10లో జోన్ రహ్మ్ ($218M), మెస్సీ (135M), లెబ్రాన్ జేమ్స్ (128.2M), జియానిస్ (111M), ఎంబాపే (110M), నెయ్‌మార్ (108M), బెంజెమా (106M), స్టీఫెన్ కర్రీ (102M), లామర్ జాక్సన్ ($100.5M) ఉన్నారు.
Similar News
News December 22, 2024
రేవంత్.. వీటినే డైవర్షన్ పాలిటిక్స్ అంటారు: టీడీపీ మహిళా నేత
TG: అల్లు అర్జున్ విషయంలో ప్రభుత్వ చర్యలను సమర్థిస్తూనే రేవంత్‌పై తెలంగాణ టీడీపీ మహిళా అధ్యక్షురాలు జ్యోత్స్న Xలో ప్రశ్నల వర్షం కురిపించారు. ‘ఫుడ్ పాయిజన్‌తో పిల్లల చావులకు బాధ్యులు ఎవరు? రుణమాఫీ అవ్వక మరణించిన రైతుల ప్రాణాలకు బాధ్యులెవరు? ఆత్మహత్య చేసుకున్న చేనేత సోదరుల మరణాలకు కారణమెవరు? ఇతర సమస్యలపై అసెంబ్లీలో చర్చించేందుకు సమయం లేదా?’ అన్నారు. వీటినే డైవర్షన్ పాలిటిక్స్ అంటారని పేర్కొన్నారు.
News December 22, 2024
వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం: టీటీడీ ఈవో
AP: తిరుమలలోని ఆలయ పరిధిలో అనధికార దుకాణాలపై కఠిన చర్యలు తీసుకుంటామని టీటీడీ ఈవో శ్యామలరావు హెచ్చరించారు. ఈ దుకాణాలతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారనే విషయం తమ దృష్టికి వచ్చినట్లు తెలిపారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ పవిత్రతను కాపాడే విధంగా కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిపారు. భక్తులు క్యూలైన్లలో వేచి ఉండే సమయాన్ని తగ్గించామని పేర్కొన్నారు.
News December 22, 2024
భారత్‌తో T20 సిరీస్‌కు ఇంగ్లండ్ జట్టు ఎంపిక
భారత్‌తో T20 సిరీస్, ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం ఇంగ్లండ్ తమ జట్టును ప్రకటించింది. 15 మందితో కూడిన జట్టుకు జోస్ బట్లర్ సారథిగా వ్యవహరిస్తారు. T20 సిరీస్ జట్టు: బట్లర్(C), మార్క్ వుడ్, రెహాన్ అహ్మద్, ఆర్చర్, అట్కిన్సన్, బెతెల్, బ్రూక్, కార్స్, డకెట్, ఓవర్టన్, జేమీ స్మిత్, లివింగ్‌స్టోన్, ఆదిల్ రషీద్, మహమూద్, ఫిల్ సాల్ట్. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం రెహాన్ అహ్మద్ స్థానంలో జో రూట్‌ను ఎంపిక చేసింది.