News December 22, 2024

వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం: టీటీడీ ఈవో

image

AP: తిరుమలలోని ఆలయ పరిధిలో అనధికార దుకాణాలపై కఠిన చర్యలు తీసుకుంటామని టీటీడీ ఈవో శ్యామలరావు హెచ్చరించారు. ఈ దుకాణాలతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారనే విషయం తమ దృష్టికి వచ్చినట్లు తెలిపారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ పవిత్రతను కాపాడే విధంగా కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిపారు. భక్తులు క్యూలైన్లలో వేచి ఉండే సమయాన్ని తగ్గించామని పేర్కొన్నారు.

Similar News

News January 23, 2025

పబ్లిసిటీ కోసమే బాబు దావోస్ పర్యటన: గుడివాడ అమర్నాథ్

image

AP: CM చంద్రబాబు దావోస్ పర్యటన నుంచి ఒట్టి చేతులతో వస్తున్నారని YCP నేత గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. పక్క రాష్ట్రాలు మాత్రం రూ.వేల కోట్ల పెట్టుబడులు రాబట్టాయని చెప్పారు. ‘దావోస్ పర్యటన పబ్లిసిటీ కోసం తప్పా ఎలాంటి ప్రయోజనం లేదు. ఒక్క కంపెనీని కూడా రాష్ట్రానికి తీసుకురాలేకపోయారు. పెట్టుబడులు రాబట్టడంలో CM అట్టర్ ఫ్లాప్. ఈ పర్యటన కోసం సర్కార్ రూ.3 కోట్ల ప్రజాధనం వృథా చేసింది’ అని ఆయన ఫైర్ అయ్యారు.

News January 23, 2025

రంజీలోనూ ఫ్లాప్ షో

image

రంజీ క్రికెట్ ఆడుతోన్న భారత బ్యాటర్లు అందులోనూ ఘోరంగా విఫలమయ్యారు. ఇవాళ రోహిత్ (3), జైస్వాల్ (4), గిల్ (4), రహానే (12), శ్రేయస్ అయ్యర్ (11), రుతురాజ్ గైక్వాడ్ (10), రజత్ పాటీదార్ (0), రిషభ్ పంత్ (1), పుజారా (6) అట్టర్ ఫ్లాప్ అయ్యారు.

News January 23, 2025

కానిస్టేబుల్ ఫిజికల్ టెస్టులో అపశ్రుతి.. అభ్యర్థి మృతి

image

AP: విశాఖపట్నంలో కానిస్టేబుల్ అభ్యర్థుల ఫిజికల్ టెస్టులో అపశ్రుతి చోటు చేసుకుంది. 1600 మీటర్ల రన్నింగ్ సమయంలో అభ్యర్థి శ్రావణ్ కుమార్ కుప్పకూలాడు. వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించగా మార్గమధ్యంలో మరణించాడు. పోలీసు అవుతాడనుకున్న కొడుకు పుట్టినరోజునే మృతి చెందటంతో శ్రావణ్ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.