News May 17, 2024
అతనికి భయపడి మాట మార్చారు: స్వాతి మాలివాల్
కేజ్రీవాల్ పీఏ బిభవ్ కుమార్‌పై వస్తున్న ఆరోపణలు బీజేపీ కుట్రలో భాగం అని ఆప్ మంత్రి ఆతిశీ వ్యాఖ్యానించడంపై ఎంపీ స్వాతి మాలివాల్ మండిపడ్డారు. పార్టీలోకి నిన్న మొన్న వచ్చిన వాళ్లు తనపై బీజేపీ ఏజెంట్ అనే ముద్ర వేశారని అన్నారు. రెండు రోజుల క్రితం దాడి జరిగినట్లు అంగీకరించిన పార్టీ.. ఇవాళ మాట మార్చిందని పేర్కొన్నారు. ‘ఆ గూండా(బిభవ్) పార్టీ సీక్రెట్లు బయటపెడతాడని భయపడుతున్నారు’ అని ఆరోపించారు.
Similar News
News January 12, 2025
ఛాంపియన్స్ ట్రోఫీకి కివీస్ టీమ్ ఇదే
ఛాంపియన్స్ ట్రోఫీకి న్యూజిలాండ్ తమ జట్టును ప్రకటించింది. 15 మందితో కూడిన ఈ జట్టుకు మిచెల్ శాంట్నర్ సారథ్యం వహిస్తారు. సీనియర్ ప్లేయర్ కేన్ విలియమ్సన్ రీఎంట్రీ ఇచ్చారు. జట్టు: శాంట్నర్ (C), మైకేల్ బ్రేస్‌వెల్, మార్క్ చాప్‌మన్, డేవాన్ కాన్వే, లాకీ ఫెర్గ్యూసన్, మాట్ హెన్రీ, టామ్ లాథమ్, డారిల్ మిచెల్, విల్ ఓ రూర్కీ, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, బెన్ సియర్స్, నాథన్ స్మిత్, విలియమ్సన్, విల్ యంగ్.
News January 12, 2025
ఎన్‌కౌంటర్‌లో నలుగురు మావోయిస్టుల మృతి
ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు మావోయిస్టులు మృతిచెందారు. మద్దేడు పీఎస్ పరిధిలో ఈ ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. సంఘటనా స్థలంలో భారీగా ఆయుధాలు లభించాయి. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News January 12, 2025
బాధితులకు టీటీడీ చెక్కుల పంపిణీ
AP: తిరుపతి తొక్కిసలాట మృతుల కుటుంబాలకు టీటీడీ నష్టపరిహారం అందజేసింది. ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన 4 కుటుంబాలకు చెక్కులు పంపిణీ చేసింది. లావణ్య, రజనీ, శాంతి కుటుంబసభ్యులకు రూ.25 లక్షలు అందించింది. అలాగే మృతుల కుటుంబాల్లో ఒకరికి టీటీడీలో కాంట్రాక్టు ఉద్యోగం కల్పించనుంది. మృతుల పిల్లలకు ఉచిత విద్య అందించనుంది.