News May 18, 2024
పంజాబ్ కెప్టెన్‌గా జితేశ్ శర్మ

రేపు హైదరాబాద్‌తో జరగబోయే మ్యాచ్‌కు పంజాబ్ కెప్టెన్‌గా జితేశ్ శర్మ వ్యవహరించనున్నారు. రెగ్యులర్ కెప్టెన్ సామ్ కరన్ స్వదేశం వెళ్లిపోవడంతో ఆయన ఈ బాధ్యతలు చేపట్టనున్నారు. కాగా ఈ సీజన్‌లో జితేశ్ పూర్తిగా నిరాశపరిచారు. 13 మ్యాచ్‌లు ఆడి 155 పరుగులు మాత్రమే చేశారు. మరోవైపు పంజాబ్ కూడా ఈ సీజన్‌లో ఆకట్టుకోలేదు. ఇప్పటివరకు 13 మ్యాచ్‌లు ఆడి ఐదింట్లోనే గెలిచింది.
Similar News
News January 18, 2026
Friendflationతో ఒంటరవుతున్న యువత!

ఇన్‌ఫ్లేషన్ ఇప్పుడు ఫ్రెండ్‌ఫ్లేషన్‌గా మారి యువతను ఒంటరి చేస్తోంది. పెరిగిన హోటల్ బిల్లులు, సినిమా టికెట్లు, పెట్రోల్ ఖర్చుల భయంతో మెట్రో నగరాల్లోని యువత బయటకు వెళ్లడం తగ్గించేస్తున్నారు. ఫ్రెండ్స్ కలిసినప్పుడు ఖర్చు భరించలేక చాలామంది ఇన్విటేషన్లను సున్నితంగా తిరస్కరిస్తున్నారు. పార్కులు, ఇంటి దగ్గర చిన్నపాటి మీటింగ్స్ వంటి లో-కాస్ట్ ప్లాన్స్‌తో స్నేహాన్ని కాపాడుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
News January 18, 2026
జోరందుకున్న మద్యం అమ్మకాలు

AP: సంక్రాంతి పండుగ పురస్కరించుకొని రాష్ట్రంలో మద్యం అమ్మకాలు జోరందుకున్నాయి. ఈ నెల 9వ తేదీ నుంచి 16 వ తేదీ వరకు సాధారణ రోజులతో పోల్చితే రెట్టింపు బిజినెస్ జరిగినట్లు సమాచారం. ప్రతి రోజూ రూ.85 కోట్ల లిక్కర్ సేల్ జరిగినట్లు లెక్కలు వెల్లడించాయి. ఈ వారం వ్యవధిలో రూ.877 కోట్ల మేర విక్రయాలు జరిగినట్లు చెప్పాయి. పండుగ 3 రోజుల్లో రూ.438 కోట్ల విలువైన మద్యం అమ్ముడైనట్లు తెలిపాయి.
News January 18, 2026
ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేదలో ఉద్యోగాలు

ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద (<


