News May 18, 2024
పంజాబ్ కెప్టెన్‌గా జితేశ్ శర్మ

రేపు హైదరాబాద్‌తో జరగబోయే మ్యాచ్‌కు పంజాబ్ కెప్టెన్‌గా జితేశ్ శర్మ వ్యవహరించనున్నారు. రెగ్యులర్ కెప్టెన్ సామ్ కరన్ స్వదేశం వెళ్లిపోవడంతో ఆయన ఈ బాధ్యతలు చేపట్టనున్నారు. కాగా ఈ సీజన్‌లో జితేశ్ పూర్తిగా నిరాశపరిచారు. 13 మ్యాచ్‌లు ఆడి 155 పరుగులు మాత్రమే చేశారు. మరోవైపు పంజాబ్ కూడా ఈ సీజన్‌లో ఆకట్టుకోలేదు. ఇప్పటివరకు 13 మ్యాచ్‌లు ఆడి ఐదింట్లోనే గెలిచింది.
Similar News
News November 7, 2025
లెస్బియన్ అఫైర్.. 6 నెలల బిడ్డను చంపిన తల్లి?

తన భార్య మరో మహిళతో అఫైర్ పెట్టుకుని 6 నెలల బిడ్డను చంపి ఉండొచ్చని తండ్రి ఆరోపించారు. తమిళనాడు కృష్ణగిరి(D)లో ఈ ఘటన జరిగింది. కొన్ని రోజుల కిందట బేబీ మరణించగా, అనారోగ్యమే కారణమనుకుని పోస్టుమార్టం చేయకుండానే పూడ్చిపెట్టారు. తాజాగా భార్య ఫోన్‌లో లెస్బియన్ చాటింగ్‌ను గుర్తించిన భర్త.. పోలీసులను ఆశ్రయించారు. దీంతో ఇవాళ బేబీ బాడీకి పోస్టుమార్టం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.
News November 7, 2025
న్యూస్ అప్‌డేట్స్ @10AM

*గన్నవరం చేరుకున్న ప్రపంచకప్ ఛాంపియన్ క్రికెటర్ శ్రీచరణి. మధ్యాహ్నం సీఎం చంద్రబాబుతో భేటీ
*BRS ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు, మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఇంట్లో పోలీసుల సోదాలు. ఎలక్షన్ కోడ్ అమల్లో లేని ప్రాంతంలో రైడ్స్ ఏంటని రవీందర్ రావు ఆగ్రహం
*ఢిల్లీ విమానాశ్రయంలో సాంకేతిక సమస్య.. 100కు పైగా ఫ్లైట్లు ఆలస్యం
News November 7, 2025
నాకు విజయ్‌తో శత్రుత్వం లేదు: అజిత్

కోలీవుడ్‌లో ఫ్యాన్ వార్‌పై హీరో అజిత్ అసహనం వ్యక్తం చేశారు. దళపతి విజయ్‌తో తనకు వైరం ఉందనే ప్రచారాన్ని ఖండించారు. ‘కొందరు నాకు, విజయ్‌కు శత్రుత్వం ఉందని ప్రచారం చేస్తున్నారు. వీటిని చూసి అభిమానులు గొడవలు పడుతున్నారు. ఇలాంటి సమస్యలు సృష్టించే వారు మౌనంగా ఉండటం మంచిది. నేనెప్పుడు <<18165294>>విజయ్ మంచినే<<>> కోరుకుంటా’ అని స్పష్టం చేశారు. కరూర్ తొక్కిసలాటకు అందరూ బాధ్యులేనని అజిత్ ఇటీవల పేర్కొన్న విషయం తెలిసిందే.


