News May 18, 2024
‘నా మాజీ భర్త ప్రస్తావన తీసుకురావొద్దు’.. రేణూ దేశాయ్ ఫైర్

సోషల్ మీడియాలో తాను పెట్టే ప్రతీ పోస్టు విషయంలో తన మాజీ భర్తతో నన్ను ఎందుకు పోలుస్తారని రేణూదేశాయ్ ఫైరయ్యారు. జంతు సంరక్షణ కోసం ఆమె విరాళాలు సేకరించగా.. ‘మా పవన్ అన్నయ్యలా గోల్డెన్ హార్ట్’ అని ఓ నెటిజన్ ఆ పోస్టుపై కామెంట్ చేశాడు. ‘పదేళ్లుగా జంతు సంరక్షణ కోసం సాయం చేస్తున్నా. దానికి నా మాజీ భర్తతో సంబంధం లేదు. నా పనుల గురించి పోస్ట్ పెడితే.. ఆయన ప్రస్తావన తెస్తూ కామెంట్ చేయకండి’ అని ఆమె కోరారు.
Similar News
News July 6, 2025
మేమేం పిచ్చోళ్లం కాదు: ఇంగ్లండ్ అసిస్టెంట్ కోచ్

రెండో టెస్టులో భారత్ సంధించిన భారీ లక్ష్యాన్ని చేధించడం కష్టమని, పిచ్ తీరును బట్టి తమ బ్యాటర్లు ఆడతారని ఇంగ్లండ్ అసిస్టెంట్ కోచ్ మార్కస్ ట్రెస్కోథిక్ అన్నారు. తామేమీ పిచ్చోళ్లం కాదని గెలుపు కుదరకపోతే డ్రా కోసం ప్రయత్నిస్తామని చెప్పారు. ‘ఒక్క రోజులో 550కుపైగా పరుగులు చేయడం అసాధ్యం. కానీ మా బ్యాటర్లు మాత్రం పోరాటం ఆపరు’ అని ఆయన స్పష్టం చేశారు.
News July 6, 2025
PLEASE CHECK.. ఇందులో మీ పేరు ఉందా?

AP: అన్నదాతా సుఖీభవ పథకానికి తాము అర్హులమో? కాదో? తెలుసుకునే అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. https://annadathasukhibhava.ap.gov.in/లో చెక్ స్టేటస్ ఆప్షన్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఆధార్ నంబర్, క్యాప్చా ఎంటర్ చేస్తే రైతులకు తాము అర్హులమో కాదో అన్న వివరాలు తెలుస్తాయి. ఎందుకు <<16960279>>అనర్హత <<>>ఉందో కూడా కారణం తెలుసుకోవచ్చు. మీరు అర్హులో కాదో తెలుసుకునేందుకు ఇక్కడ <
News July 6, 2025
అగ్నివీర్ నోటిఫికేషన్ విడుదల

ఇండియన్ నేవీలో మ్యుజిషియన్ విభాగంలో అగ్నివీర్ నియామకాలకు <