News May 18, 2024
IPL: మ్యాచ్‌కు వర్షం అడ్డంకి

బెంగళూరు, చెన్నై మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. ఆర్సీబీ ఇన్నింగ్స్ 3 ఓవర్ల వద్ద చినుకులు పడటంతో మ్యాచ్ ఆగిపోయింది. వెంటనే గ్రౌండ్ స్టాఫ్ కవర్లతో పిచ్‌ను కప్పేశారు. 3 ఓవర్లకు ఆర్సీబీ 31 పరుగులు చేసింది. కాసేపట్లోనే మ్యాచ్ తిరిగి ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
Similar News
News September 18, 2025
తెలంగాణ న్యూస్ రౌండప్

* రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు(పట్టణ రవాణా శాఖ)గా బాధ్యతలు.. CM రేవంత్‌ను కలిసిన NVS రెడ్డి
* SEP 21న చింతమడకలో ఎంగిలిపూల బతుకమ్మ ఆడనున్న కల్వకుంట్ల కవిత
* HYDలో భారీ వర్షం.. GHMC, హైడ్రా, పోలీస్, విద్యుత్ విభాగాలు సమన్వయం చేసుకోవాలన్న మంత్రి పొన్నం
* మూసీకి వరద.. అంబర్‌పేట్-మూసారాంబాగ్ బ్రిడ్జి క్లోజ్
* SEP 21-30 వరకు జరిగే బతుకమ్మ వేడుకల్లో మహిళలు పెద్దఎత్తున పాల్గొనాలి: మంత్రి జూపల్లి
News September 18, 2025
రేపు OTTలోకి ‘మహావతార్ నరసింహ’

చిన్న సినిమాగా విడుదలై బాక్సాఫీసు వద్ద సంచలనం సృష్టించిన ‘మహావతార్ నరసింహ’ సినిమా OTT రిలీజ్ డేట్ ఖరారైంది. రేపటి నుంచి Netflixలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. మహా విష్ణువు నరసింహావతారం ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీ రూ.300 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. అశ్విన్ కుమార్ దర్శకత్వం వహించారు. జులై 25న విడుదలైన ఈ యానిమేటెడ్ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.
News September 18, 2025
పలు ఆలయాల బోర్డులకు ఛైర్మన్ల నియామకం

AP: రాష్ట్రంలోని వివిధ దేవాలయాల బోర్డులకు రాష్ట్ర ప్రభుత్వం ఛైర్మన్లను నియమించింది.
1.శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానం(శ్రీశైలం)- P.రమేశ్ నాయుడు
2.శ్రీ కాళహస్తీశ్వర స్వామి దేవస్థానం- కొట్టె సాయి ప్రసాద్
3.శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం(కాణిపాకం)- V.సురేంద్ర బాబు
4.శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం(ఇంద్రకీలాద్రి)- B.రాధాకృష్ణ
5.శ్రీ వేంకటేశ్వర ఆలయం(వాడపల్లి)- M.వెంకట్రాజు