News May 18, 2024
IPL: మ్యాచ్‌కు వర్షం అడ్డంకి
బెంగళూరు, చెన్నై మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. ఆర్సీబీ ఇన్నింగ్స్ 3 ఓవర్ల వద్ద చినుకులు పడటంతో మ్యాచ్ ఆగిపోయింది. వెంటనే గ్రౌండ్ స్టాఫ్ కవర్లతో పిచ్‌ను కప్పేశారు. 3 ఓవర్లకు ఆర్సీబీ 31 పరుగులు చేసింది. కాసేపట్లోనే మ్యాచ్ తిరిగి ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
Similar News
News December 7, 2024
నో పవర్ షేరింగ్ ఫార్ములా: డీకే శివకుమార్
CM సిద్దరామయ్య, తన మధ్య ఎలాంటి పవర్ షేరింగ్ ఫార్ములా లేదని DK శివకుమార్ స్పష్టం చేశారు. ఈ విషయంలో పార్టీ నేతలెవరూ మాట్లాడవద్దన్నారు. తానెప్పుడూ ఏ ఫార్ములా గురించి మాట్లాడలేదని, రాజకీయ అవగాహనతో ఇద్దరం కలిసి పనిచేస్తున్నామని పేర్కొన్నారు. అధికారంలోకి రాకముందే CMతో ఒప్పందం కుదిరిందని ఇటీవల DK వ్యాఖ్యానించగా, అలాంటి ఒప్పందం ఏమీ లేదని CM కొట్టిపారేశారు. దీంతో రచ్చ మొదలైంది.
News December 7, 2024
ఆ కారు పేరు మార్చేసిన మహీంద్రా
మహీంద్రా తన కొత్త ఎలక్ట్రిక్ కారు మోడల్ పేరును మార్చాలని నిర్ణయించింది. ఇటీవల SUV మోడల్స్‌లో BE 6e విడుదల చేసింది. అయితే మోడల్ పేరులో 6e వాడకంపై విమానయాన సంస్థ IndiGo అభ్యంతరం వ్యక్తం చేస్తూ కోర్టుకెక్కింది. ఏళ్లుగా తమ బ్రాండ్ ఐడెంటిటీలో 6eని వాడుతున్నామని, దీనిపై తమకు ట్రేడ్‌మార్క్ హక్కులు ఉన్నాయంటూ వాదించింది. దీంతో మహీంద్రా తన BE 6e మోడల్‌ను BE 6గా మార్చింది.
News December 7, 2024
ఉమ్మడి ఏపీ కంటే కేసీఆర్ వల్లే ఎక్కువ నష్టం: సీఎం రేవంత్
TG: ఉమ్మడి ఏపీలో కంటే కేసీఆర్ పదేళ్ల పాలనలోనే తెలంగాణకు ఎక్కువ నష్టం కలిగిందని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. నల్గొండలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన సీఎం.. బహిరంగ సభలో మాట్లాడారు. లక్ష ఎకరాలకు నీరందించే బ్రాహ్మణవెల్లి ప్రాజెక్టును అప్పటి సీఎం వైఎస్సార్ ప్రారంభిస్తే.. కేసీఆర్ పదేళ్లు పట్టించుకోలేదని మండిపడ్డారు. SLBC ప్రాజెక్టు పూర్తి చేసి ఉంటే ఫ్లోరైడ్ సమస్య తీరేదని వ్యాఖ్యానించారు.