News May 20, 2024
మే 20: చరిత్రలో ఈరోజు
1983: హీరో జూ.ఎన్టీఆర్ జననం
1984: నటుడు మంచు మనోజ్ జననం
1955: తెలుగు సినీ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి జననం
1978: భారత మాజీ అథ్లెట్ పి.టి.ఉష జననం
1932: స్వాతంత్ర్య పోరాటయోధుడు బిపిన్ చంద్రపాల్ మరణం
1994: ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం కాసు బ్రహ్మానంద రెడ్డి మరణం
1902: క్యూబా స్వతంత్ర దినం
ప్రపంచ తూనికలు, కొలతల దినోత్సవం
Similar News
News December 26, 2024
ధాన్యం కొనుగోలు కొనసాగించండి: రాయదుర్గం ఎమ్మెల్యే
అనంతపురం జిల్లాలో రైతులు పండించిన వరి ధాన్యాన్ని, ప్రభుత్వం ప్రకటించిన ధరతో సకాలంలో కొనుగోలు చేయాలని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులను ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు ఆదేశించారు. గురువారం ఆయన సంబంధిత అధికారులు డీఎం రమేశ్ రెడ్డి, ప్రసాద్ బాబు, డీటీ సుబ్రహ్మణ్యంలతో ధాన్యం సేకరణపై సమీక్ష నిర్వహించారు. రాయదుర్గం, శింగనమల నియోజకవర్గాలలో గిట్టుబాటు ధర లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.
News December 26, 2024
పాక్‌పై యుద్ధానికి 15వేలమంది తాలిబన్లు
తూర్పు అఫ్గానిస్థాన్‌పై పాకిస్థాన్ జరిపిన వైమానిక దాడులకు ప్రతీకారం తీర్చుకుంటామని అక్కడి తాలిబన్ సర్కారు తేల్చిచెప్పింది. కాబూల్ నుంచి పాక్ సరిహద్దుల్లోకి 15వేలమంది తాలిబన్ ఫైటర్లను తరలిస్తున్నట్లు ప్రకటించింది. అఫ్గాన్‌లో తాలిబన్లు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పాక్‌లో వారి అనుబంధ సంస్థ టీటీపీ ఉగ్రదాడులు పెంచింది. ఈ నేపథ్యంలోనే పాక్, అఫ్గాన్ మధ్య సంబంధాలు క్షీణించాయి.
News December 26, 2024
రూ.1,700 కోట్లు దాటిన ‘పుష్ప 2’ కలెక్షన్లు
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘పుష్ప 2’ మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డులు కొల్లగొడుతోంది. ఇప్పటివరకు ఈ సినిమా వరల్డ్‌వైడ్‌గా రూ.1,705 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. 21 రోజుల్లోనే రూ.1705 కోట్లు సాధించిన తొలి చిత్రంగా నిలిచింది. హిందీలోనే ఈ చిత్రం 700 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టింది. ఒక్క ముంబైలోనే రూ.200 కోట్లకుపైగా కలెక్షన్లు చేసింది.