News May 20, 2024

మే 20: చరిత్రలో ఈరోజు

image

1983: హీరో జూ.ఎన్టీఆర్ జననం
1984: నటుడు మంచు మనోజ్ జననం
1955: తెలుగు సినీ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి జననం
1978: భారత మాజీ అథ్లెట్ పి.టి.ఉష జననం
1932: స్వాతంత్ర్య పోరాటయోధుడు బిపిన్ చంద్రపాల్ మరణం
1994: ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం కాసు బ్రహ్మానంద రెడ్డి మరణం
1902: క్యూబా స్వతంత్ర దినం
ప్రపంచ తూనికలు, కొలతల దినోత్సవం

Similar News

News December 7, 2024

విద్యార్థులకు ఫుడ్ పాయిజన్.. సర్కార్ కీలక ఆదేశాలు

image

TG: రాష్ట్రంలోని ప్రభుత్వ, మోడల్ స్కూళ్లు, గురుకులాలు, హాస్టళ్లు, KGBVల్లో ఆహార నాణ్యతపై ప్రభుత్వం ప్రత్యేక నిబంధనలు జారీ చేసింది. బియ్యంలో పురుగులు, బూజు కనిపిస్తే వాడకూడదు. విద్యార్థులకు భోజనం వేడివేడిగా వడ్డించాలి. వండిన వెంటనే ప్రిన్సిపల్, మెస్ ఇన్‌ఛార్జి రుచి చూడాలి. మిగిలిన ఆహారాన్ని విద్యార్థులకు పెట్టకూడదు. రెండు పూటలకు పప్పు ఒకేసారి వండకూడదు. సిబ్బంది మాస్కు, టోపీ, ఆప్రాన్ ధరించాలి.

News December 7, 2024

మార్చి 15 నుంచి టెన్త్ ఎగ్జామ్స్?

image

AP: రాష్ట్రంలో వచ్చే ఏడాది మార్చి 15 నుంచి పదో తరగతి పరీక్షలు జరుగుతాయని తెలుస్తోంది. కొత్త సిలబస్ ప్రకారమే ఈ ఎగ్జామ్స్ నిర్వహించనున్నట్లు సమాచారం. అలాగే గతంలో పరీక్ష రాసి ఫెయిలైన వారికి పాత సిలబస్ ప్రకారం పరీక్షలు ఉంటాయని తెలుస్తోంది. ఇప్పటికే వెబ్‌సైట్‌లో ప్రశ్నాపత్రాలు, మోడల్ పేపర్లు, మార్కుల వెయిటేజీ వంటి తదితర వివరాలు పొందుపరిచారు.

News December 7, 2024

18న గురుకుల సొసైటీ ప్రవేశాలకు నోటిఫికేషన్

image

TG: గురుకుల సొసైటీ ప్రవేశాలకు ఈ నెల 18న నోటిఫికేషన్ విడుదల చేస్తున్నట్లు సొసైటీ కార్యదర్శి అలగు వర్షిణి తెలిపారు. ఫిబ్రవరి 23న రాత పరీక్ష నిర్వహిస్తామన్నారు. జూన్ 12లోగా అడ్మిషన్ల ప్రక్రియను పూర్తి చేస్తామని పేర్కొన్నారు. అలాగే 2025-26 విద్యా సంవత్సరంలో ఇంటర్ ప్రవేశాలకు ఎలిజిబిలిటీ టెస్ట్ నిర్వహించడం లేదని వెల్లడించారు. పది పాసైన వారికి నేరుగా ఇంటర్మీడియట్ ప్రవేశాలు కల్పిస్తామన్నారు.