News May 20, 2024
నేడు తెలంగాణ కేబినెట్ భేటీ.. వాటిపైనే చర్చ!

ఈసీ షరతులతో కూడిన అనుమతి ఇవ్వడంతో తెలంగాణ కేబినెట్ నేడు భేటీ కానుంది. ఈసీ ఆంక్షల పరిధిలోకి రాని అంశాలపైనే ఈ సమావేశంలో చర్చించనున్నట్లు సమాచారం. ఎన్నికల కోడ్ నేపథ్యంలో జూన్ 4లోపు చేయవల్సిన అత్యవసర విషయాలపైనే చర్చించాలని, రైతు రుణమాఫీ వంటి అంశాలను పక్కనపెట్టాలని ప్రభుత్వానికి ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. అలాగే ఎన్నికల నిర్వహణలో భాగమైన ప్రభుత్వ అధికారులను ఈ భేటీకి హాజరుకావొద్దని ఆదేశించింది.
Similar News
News November 14, 2025
బీజాక్షరం అంటే ఏంటి..?

బీజాక్షరం అంటే దైవశక్తికి మూలశబ్దం. బీజమంటే విత్తనం. అక్షరమంటే నాశనం లేని శబ్దం. చిన్న విత్తులో గొప్ప వృక్షం దాగి ఉన్నట్లే దేవతాశక్తి బీజాక్షరంలో ఇమిడి ఉంటుంది. ప్రతి దేవతకు ఒక బీజం ఉంటుంది. మంత్రాలలో ప్రధానంగా, శక్తివంతంగా ఉండే ఈ అక్షరమే ఆ మంత్రానికి తాళం చెవి వంటిది. దీనిని పఠించడం ద్వారా మనం ఆ దేవత సంపూర్ణ అనుగ్రహాన్ని, శక్తిని పొందగలం. ఇది ఆధ్యాత్మిక సాధనకు అత్యంత ముఖ్యమైన మూలం. <<-se>>#VedikVibes<<>>
News November 14, 2025
3 చోట్ల ముందంజలో ప్రశాంత్ కిశోర్ పార్టీ

బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌కు చెందిన జన్ సురాజ్ పార్టీ 3 చోట్ల ముందంజలో కొనసాగుతోంది. ఎగ్జిట్ పోల్స్ మాత్రం ఈ పార్టీ ప్రభావం చూపించదని అంచనా వేశాయి. కీలకమైన స్థానాల్లోనూ ఓట్ల వాటాను దక్కించుకుంటున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ ఎఫెక్ట్ మహాగఠ్‌బంధన్‌పై పడే అవకాశం ఉంది. మరోవైపు NDA కూటమి ఎగ్జిట్ పోల్స్ చెప్పిన విధంగా దూసుకెళ్తోంది.
News November 14, 2025
బిహార్: మ్యాజిక్ ఫిగర్ దాటిన NDA

బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో NDA దూసుకుపోతోంది. లీడింగ్‌లో ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ 122ను దాటేసింది. ప్రస్తుతం NDA 155, MGB 65, JSP 3స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. ప్రధాన పార్టీల వారీగా చూస్తే BJP:78, JDU: 65, RJD:59, కాంగ్రెస్: 11.


