News May 20, 2024

నేడు తెలంగాణ కేబినెట్ భేటీ.. వాటిపైనే చర్చ!

image

ఈసీ షరతులతో కూడిన అనుమతి ఇవ్వడంతో తెలంగాణ కేబినెట్ నేడు భేటీ కానుంది. ఈసీ ఆంక్షల పరిధిలోకి రాని అంశాలపైనే ఈ సమావేశంలో చర్చించనున్నట్లు సమాచారం. ఎన్నికల కోడ్ నేపథ్యంలో జూన్ 4లోపు చేయవల్సిన అత్యవసర విషయాలపైనే చర్చించాలని, రైతు రుణమాఫీ వంటి అంశాలను పక్కనపెట్టాలని ప్రభుత్వానికి ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. అలాగే ఎన్నికల నిర్వహణలో భాగమైన ప్రభుత్వ అధికారులను ఈ భేటీకి హాజరుకావొద్దని ఆదేశించింది.

Similar News

News December 14, 2024

ఆ జిల్లాలకు వర్ష సూచన

image

AP: రాష్ట్రంపై మళ్లీ వర్ష ప్రభావం ఉండనుందని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ అండమాన్ సముద్రంపై శనివారం ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని వివరించింది. ఇది అల్పపీడనంగా బలపడి తమిళనాడు వద్ద తీరం దాటుతుందని పేర్కొంది. దీని ప్రభావం కోస్తాంధ్రపై ఉంటుందని తెలిపింది. దీంతో 17న రాత్రి నుంచి రాష్ట్రంలోని తీర ప్రాంత జిల్లాల్లో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని స్పష్టం చేసింది.

News December 14, 2024

BIG BREAKING: జైలు నుంచి అల్లు అర్జున్ విడుదల

image

చంచల్‌గూడ జైలు నుంచి హీరో అల్లు అర్జున్ విడుదలయ్యారు. హైకోర్టు మధ్యంతర బెయిల్ ఉత్తర్వులను పరిశీలించిన జైలు అధికారులు ఆయనను వెనుక గేటు నుంచి పంపించారు. సంధ్య థియేటర్ తొక్కిసలాటలో మహిళ చనిపోయిన కేసులో బన్నీని నిన్న చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అరెస్టుపై బన్నీ లాయర్లు హైకోర్టును ఆశ్రయించగా మధ్యంతర బెయిల్ లభించింది.

News December 14, 2024

IND vs AUS: మ్యాచ్‌కు వరుణుడి ఆటంకం

image

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడో టెస్టుకు వరుణుడు ఆటంకం కలిగించాడు. దీంతో అంపైర్లు ఆటను నిలిపేశారు. టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకోగా ఆసీస్ బ్యాటింగ్‌కు దిగింది. జట్టు స్కోరు 5.3 ఓవర్లలో 19/0 పరుగుల వద్ద ఉన్నప్పుడు వర్షం కురవడంతో ఆట ఆగిపోయింది. క్రీజులో ఉస్మాన్ ఖవాజా (13*), మెక్‌స్వీనీ (2) ఉన్నారు.