News May 20, 2024

విద్య అంటే ర్యాంకులు కాదు.. విజ్ఞానం: జస్టిస్ ఎన్వీ రమణ

image

AP: భావితరాల భవిష్యత్ అంతా విద్యపైనే ఆధారపడి ఉంటుందని మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ చెప్పారు. ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. చదువు అంటే ర్యాంకులు, మార్కులు కాదన్నారు. విజ్ఞానాన్ని పెంచుకోవడమే విద్య ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. విద్యార్థులు ఎంత ఉన్నతస్థాయికి ఎదిగినా మూలాలు మర్చిపోవద్దని సూచించారు.

Similar News

News January 27, 2026

CBIకి ఇస్తారా.. సిట్టింగ్ జడ్జికి ఇస్తారా: KTR

image

TG: దేశంలో ఏ బొగ్గు గనిలోలేని ‘సైట్ విజిట్ సర్టిఫికేషన్’ ఇక్కడే ఎందుకని KTR ప్రశ్నించారు. ‘నిజంగానే కేంద్రం సిఫార్సు చేసుంటే అప్పటి BRS ప్రభుత్వం అమలు చేయలేదు. మరిప్పుడు అవసరంలేని నిబంధన కాంగ్రెస్ ఎందుకు తెచ్చింది. ఇది ఎవరి లాభం కోసం? గవర్నర్ ఇన్వాల్వ్ కావాలి లేదా కిషన్ రెడ్డికి ఆదేశమివ్వాలి. CBIతో ఎంక్వైరీ చేయిస్తారా, సిట్టింగ్ జడ్జికిస్తారా అనేది మీ ఇష్టం’ అని మీడియాతో మాట్లాడారు.

News January 27, 2026

త్వరలో ATMలలో చిన్న నోట్లు.. ఛేంజ్ కూడా తీసుకోవచ్చు!

image

₹10, 20, 50 వంటి చిన్న నోట్ల చెలామణీ పెంచేందుకు కొత్త ATMలను తీసుకురావాలని కేంద్రం యోచిస్తోంది. ₹500, ₹100తోపాటు చిన్న నోట్లు విత్ డ్రా చేసుకునేలా ప్లాన్ చేస్తున్నట్లు Mint తెలిపింది. ముంబైలో పరీక్షిస్తున్నారని, ఆమోదం వస్తే దేశమంతటా అమలు చేస్తారని సమాచారం. ATMలో ఛేంజ్ తీసుకునే అంశాన్నీ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఉదాహరణకు మన దగ్గర ఉన్న ₹500 నోటును అందులో ఉంచి, ఐదు ₹100 నోట్లను తీసుకోవచ్చు.

News January 27, 2026

రేపు JEE మెయిన్… ఈ జాగ్రత్తలు తప్పనిసరి

image

రేపు, ఎల్లుండి JEE మెయిన్ పరీక్షలు జరుగనున్నాయి. దేశవ్యాప్తంగా 15L మంది వరకు వీటికి హాజరుకానున్నారు. ఉ.9-12 వరకు ఫస్ట్ సెషన్, మ.3-6 వరకు రెండో సెషన్ ఉంటుంది. APలో 30, TGలో 14 పట్టణాల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటుచేశారు. కాగా అభ్యర్థులు తమతో పాటు అడ్మిట్ కార్డు, సెల్ఫ్ డిక్లరేషన్, పాస్‌పోర్టు సైజ్ ఫొటో, ఒరిజినల్ స్కూల్ ఐడీ లేదా ఇతర ఫొటో IDని తీసుకెళ్లాలి. NTA నిషేధిత వస్తువుల్ని తీసుకుపోరాదు.