News May 20, 2024
విద్య అంటే ర్యాంకులు కాదు.. విజ్ఞానం: జస్టిస్ ఎన్వీ రమణ
AP: భావితరాల భవిష్యత్ అంతా విద్యపైనే ఆధారపడి ఉంటుందని మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ చెప్పారు. ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. చదువు అంటే ర్యాంకులు, మార్కులు కాదన్నారు. విజ్ఞానాన్ని పెంచుకోవడమే విద్య ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. విద్యార్థులు ఎంత ఉన్నతస్థాయికి ఎదిగినా మూలాలు మర్చిపోవద్దని సూచించారు.
Similar News
News December 5, 2024
రేవతి మృతికి కారణమెవరు?
‘పుష్ప-2’ చూడ్డానికి వెళ్లి <<14793383>>రేవతి<<>> అనే మహిళ తన విలువైన ప్రాణాలు కోల్పోవడం, కుమారుడు చావుబతుకుల్లో ఉండటంతో నెటిజన్లు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. బన్నీని చూసేందుకు వచ్చిన అభిమానుల రద్దీని పోలీసులు కంట్రోల్ చేయలేకపోయారు. కాగా ఫ్యాన్స్ పెద్దఎత్తున తరలివస్తారని తెలిసి కూడా ప్రీమియర్లకు ఫ్యామిలీతో కలిసి వెళ్లడం ఎందుకని, ఓ 3-4 రోజులు ఆగొచ్చు కదా అని పలువురు అభిప్రాయపడుతున్నారు. దీనిపై మీ కామెంట్?
News December 5, 2024
జూడాలకు 15 శాతం గౌరవ వేతనాలు పెంపు
AP: జూనియర్ వైద్యులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వారి గౌరవ వేతనాలను 15 శాతం పెంచుతూ వైద్యారోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు ఉత్తర్వులిచ్చారు. పెంచిన జీతాలు ఈ ఏడాది జనవరి నుంచి వర్తిస్తాయని పేర్కొన్నారు. రెసిడెంట్ స్పెషలిస్టులకు ₹70వేల నుంచి ₹80,500, రెసిడెంట్ డెంటిస్ట్‌లకు ₹65వేల నుంచి ₹74,750, రెసిడెంట్ సూపర్ స్పెషలిస్టులకు ₹85వేల నుంచి ₹97,750ల వరకు జీతాలు పెరిగాయి.
News December 5, 2024
దేవేంద్రుడి పట్టాభిషేకం నేడే
మహారాష్ట్ర CMగా దేవేంద్ర ఫడణవీస్ ఇవాళ సా.5.30 గం.కు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆయన CMగా బాధ్యతలు చేపట్టడం ఇది మూడోసారి. ముంబైలోని ఆజాద్ మైదాన్‌లో జరగనున్న ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు హాజరుకానున్నారు. ఫడణవీస్‌తో పాటు Dy.CMగా అజిత్ పవార్ ప్రమాణం చేస్తారు. అయితే డిప్యూటీ పోస్ట్ తీసుకోవడానికి ఏక్‌నాథ్ శిండే వెనుకాడుతున్నారు. ఆయన ప్రమాణం చేస్తారా? లేదా? అనేది సాయంత్రం తేలనుంది.