News May 20, 2024
జూన్ 4 తర్వాత మార్కెట్లు దూసుకెళ్తాయి: మోదీ
ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాక స్టాక్ మార్కెట్లు దూసుకెళ్తాయన్నారు ప్రధాని మోదీ. మార్కెట్లు సరికొత్త రికార్డులు నమోదు చేస్తాయన్నారు. మార్కెట్లలో పెట్టుబడులు పెట్టే సామాన్యుల సంఖ్య పెరిగితే ఆర్థికవ్యవస్థకు బలం చేకూరుతుందని పేర్కొన్నారు. బీజేపీ భారీ మెజార్టీతో గెలుపొందుతుందని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ మెజార్టీపై అనుమానాల వల్లే స్టాక్ మార్కెట్లు మందకొడిగా సాగుతున్నాయన్న ప్రచారాన్ని తోసిపుచ్చారు.
Similar News
News December 24, 2024
BGT: నాలుగో టెస్టులో 19 ఏళ్ల క్రికెటర్ అరంగేట్రం
BGT నాలుగో టెస్టులో మెక్‌స్వీని స్థానంలో సామ్ కొన్‌స్టాస్‌ను ఓపెనర్‌గా ఆడించనున్నట్లు ఆస్ట్రేలియా ప్రకటించింది. ఈ సిరీస్‌కు ముందు IND-A, ఇండియాVS ప్రైమ్ మినిస్టర్ 11 మ్యాచుల్లో అతను 73, 101 రన్స్‌తో రాణించారు. ఈ 19 ఏళ్ల క్రికెటర్ 11 ఫస్ట్ క్లాస్ మ్యాచుల్లో 718 పరుగులు చేశారు. బుమ్రాను ఎదుర్కొనేందుకు తన వద్ద ప్లాన్ ఉందని మీడియాకు వెల్లడించారు. నాలుగో టెస్టు ఎల్లుండి నుంచి మెల్‌బోర్న్‌లో జరగనుంది.
News December 24, 2024
అల్లు అర్జున్‌ను విచారించేది వీరే..
TG: అల్లు అర్జున్ కాసేపట్లో తన లీగల్ టీమ్‌తో భేటీ కానున్నారు. అనంతరం ఆ టీమ్‌తోనే ఆయన చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు వెళ్లనున్నారు. అల్లు అర్జున్‌కు నిన్న పోలీసులు BNS 35(3) కింద నోటీసులిచ్చారు. సంధ్య థియేటర్ ఘటనకు సంబంధించి చిక్కడపల్లి ఏసీపీ రమేశ్, సీఐ రాజు ఆయన్ను ప్రశ్నించనున్నారు. తొక్కిసలాట కేసులో బన్నీ A11గా ఉండగా, నాలుగు వారాల వరకు అరెస్ట్ చేయొద్దని హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే.
News December 24, 2024
స్కూళ్లకు కీలక ఆదేశాలు
TG: పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల వివరాలను జనవరి 31లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని విద్యాశాఖ ఆదేశించింది. ఇందుకు DEOలు, MEOలు, HMలను బాధ్యులుగా చేస్తూ ఉత్తర్వులిచ్చింది. విద్యార్థుల వివరాల సేకరణకు ప్రభుత్వం కొంతకాలంగా ప్రయత్నిస్తున్నప్పటికీ కేవలం 3 శాతమే పూర్తయింది. దీంతో ఈ ప్రక్రియను వేగంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటోంది.