News May 20, 2024
జూన్ 4 తర్వాత మార్కెట్లు దూసుకెళ్తాయి: మోదీ
ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాక స్టాక్ మార్కెట్లు దూసుకెళ్తాయన్నారు ప్రధాని మోదీ. మార్కెట్లు సరికొత్త రికార్డులు నమోదు చేస్తాయన్నారు. మార్కెట్లలో పెట్టుబడులు పెట్టే సామాన్యుల సంఖ్య పెరిగితే ఆర్థికవ్యవస్థకు బలం చేకూరుతుందని పేర్కొన్నారు. బీజేపీ భారీ మెజార్టీతో గెలుపొందుతుందని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ మెజార్టీపై అనుమానాల వల్లే స్టాక్ మార్కెట్లు మందకొడిగా సాగుతున్నాయన్న ప్రచారాన్ని తోసిపుచ్చారు.
Similar News
News December 4, 2024
పదవీ విరమణ వయసు మార్పుపై కేంద్ర మంత్రి ఏమన్నారంటే?
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు మార్పుపై ప్రస్తుతం ఎలాంటి ఆలోచన లేదని కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ లోక్‌సభలో చెప్పారు. పౌర సేవల్లో యువతకు ఉపాధి కల్పించేందుకు తగిన పాలసీ విధానాలను రూపొందించడంలో కేంద్రం నిమగ్నమైనట్లు పేర్కొన్నారు. ఎప్పటికప్పుడు ఖాళీలను భర్తీ చేస్తున్నట్లు వెల్లడించారు. కాగా ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు 60 ఏళ్లుగా ఉంది.
News December 4, 2024
వారికి రుణమాఫీ చేసే బాధ్యత నాదే: మంత్రి పొన్నం
TG: రూ.2 లక్షల లోపు రుణం ఉన్న వారికి మాఫీ చేసే బాధ్యత తనదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఎవరికైనా ఇప్పటికీ మాఫీ కాకపోతే తన ఆఫీసుకు రావాలన్నారు. రూ.2 లక్షలపైనే రుణాలు ఉన్న వారికి త్వరలోనే మాఫీ చేస్తామని చెప్పారు. ఆపై వడ్డీ చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేశామని తెలిపారు. మిగిలిన హామీలను వరుస క్రమంలో నెరవేరుస్తామని పేర్కొన్నారు.
News December 4, 2024
కేబినెట్‌లో ఏక్‌నాథ్ శిండే కీలకపాత్ర పోషిస్తారు: ఫడణవీస్
ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని మహారాష్ట్రలో మహాయుతి కూటమి నేతలు గవర్నర్‌ను కోరారు. అనంతరం సీఎం అభ్యర్థి దేవేంద్ర ఫడణవీస్ మీడియాతో మాట్లాడారు. ‘రేపు సాయంత్రం 5.30 గంటలకు జరిగే ప్రమాణ స్వీకారానికి ప్రధాని మోదీ హాజరవుతారు. డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ ఉంటారు. కేబినెట్‌లో ఏక్‌నాథ్ శిండే కీలకపాత్ర పోషిస్తారు’ అని తెలిపారు. కాగా ప్రమాణ స్వీకారానికి ఏపీ సీఎం చంద్రబాబు కూడా హాజరుకానున్నారు.