News May 21, 2024
‘బ్రిక్స్’కు ప్రాధాన్యత ఎందుకు?
2023 DEC నాటికి బ్రిక్స్‌లోని 5 దేశాల జనాభా 324 కోట్లు. GDP 26 ట్రిలియన్ డాలర్లు. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో 26 శాతానికి సమానం. IMF, ప్రపంచ బ్యాంకుల్లో అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రాతినిధ్యం పెంచేందుకు ఈ కూటమి కృషి చేస్తోంది. పేద దేశాలకు రుణాలు ఇవ్వడం కోసం రూ.20.78 లక్షల కోట్లతో న్యూ డెవలప్‌మెంట్ బ్యాంక్(NDB)ని ఏర్పాటు చేశాయి. ఈ కూటమి బలంగా మారడంతో ఇందులో చేరడానికి దేశాలు ఆసక్తి చూపుతున్నాయి.
Similar News
News January 11, 2025
బీఆర్ఎస్ రైతు మహాధర్నా వాయిదా
TG: BRS పార్టీ చేపట్టిన రైతు మహాధర్నా కార్యక్రమం మరోసారి వాయిదా పడింది. సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రజల ప్రయాణాలు, తమ ధర్నాతో ట్రాఫిక్ రద్దీ ఏర్పడే అవకాశం ఉండటంతో ఈ కార్యక్రమాన్ని పోస్ట్ పోన్ చేసింది. మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి ఆధ్వర్యంలో రేపు నల్గొండలో జరిగే కార్యక్రమంలో KTR సహా కీలక నేతలు పాల్గొనాల్సి ఉంది. పండుగ తర్వాత కొత్త తేదీని ఆ పార్టీ ప్రకటించే అవకాశం ఉంది.
News January 11, 2025
27న తెలంగాణకు రాహుల్, ఖర్గే
TG: కాంగ్రెస్ చీఫ్ ఖర్గే, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఈ నెల 27న రాష్ట్రంలో పర్యటించనున్నారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా నిర్వహిస్తున్న ‘సంవిధాన్ బచావో’ కార్యక్రమంలో వారు పాల్గొంటారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్ తదితర కార్యక్రమాలను కాంగ్రెస్ దేశవ్యాప్తంగా నిర్వహించనున్న విషయం తెలిసిందే.
News January 11, 2025
‘ఇన్ఫోసిస్‌కు రాజీనామా చేశా.. కారణాలు ఇవే’
Infosys పుణే క్యాంపస్‌లో సిస్టం ఇంజినీర్‌గా పనిచేసే భూపేంద్ర ఉద్యోగానికి రిజైన్ చేయడానికి చెప్పిన కారణాలు వైరలవుతున్నాయి. *హైక్ లేని ప్రమోషన్ *హైరింగ్ జరపకుండా ఉన్న ఉద్యోగులపైనే అధిక వర్క్‌లోడ్ *కెరీర్ గ్రోత్ లేకపోవడం *టాక్సిక్ క్లైంట్ కల్చర్ *పని విషయంలో సీనియర్లు ప్రశంసించినా జీతాలు పెరగకపోవడం* ఆన్‌సైట్ పంపేవారిని మెరిట్ ఆధారంగా కాకుండా మాట్లాడే భాషా ప్రామాణికంగా ఎంపిక చేయడం.