News May 21, 2024
గొప్పలేనా? 4 నెలలుగా జీతాలు ఇవ్వరా?: హరీశ్‌రావు
TG: నర్సింగ్ ఆఫీసర్లకు 4 నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం జీతాలు ఇవ్వలేదని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. ‘మా హయాంలోని రిక్రూట్‌మెంట్‌ను మీ ఖాతాలో వేసుకున్నారు. అట్టహాసంగా నియామక పత్రాలు ఇచ్చి.. జీతభత్యాలను పట్టించుకోలేదు. జీతాలు అందక 4వేల మంది ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి నెలా 1వ తేదీనే జీతాలు ఇస్తామని గొప్పలు చెబుతున్న నేతలు వాస్తవాలు గుర్తించాలి. వెంటనే జీతాలు చెల్లించాలి’ అని డిమాండ్ చేశారు.
Similar News
News January 11, 2025
APPLY NOW: బ్యాంకులో 1,267 ఉద్యోగాలు
బ్యాంక్ ఆఫ్ బరోడాలోని పలు విభాగాల్లో 1,267 ఉద్యోగాలకు దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నెల 17 చివరితేదీ. ఆయా పోస్టులను బట్టి డిగ్రీ, PG, MBA, MCA, బీటెక్ చేసిన వారు అర్హులు. జనరల్, EWS, OBCలకు అప్లికేషన్ ఫీజు రూ.600, మిగతా వారికి రూ.100. ఆన్‌లైన్ పరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పూర్తి వివరాల కోసం <
వెబ్‌సైట్: https://www.bankofbaroda.in/
News January 11, 2025
బీఆర్ఎస్ రైతు మహాధర్నా వాయిదా
TG: BRS పార్టీ చేపట్టిన రైతు మహాధర్నా కార్యక్రమం మరోసారి వాయిదా పడింది. సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రజల ప్రయాణాలు, తమ ధర్నాతో ట్రాఫిక్ రద్దీ ఏర్పడే అవకాశం ఉండటంతో ఈ కార్యక్రమాన్ని పోస్ట్ పోన్ చేసింది. మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి ఆధ్వర్యంలో రేపు నల్గొండలో జరిగే కార్యక్రమంలో KTR సహా కీలక నేతలు పాల్గొనాల్సి ఉంది. పండుగ తర్వాత కొత్త తేదీని ఆ పార్టీ ప్రకటించే అవకాశం ఉంది.
News January 11, 2025
27న తెలంగాణకు రాహుల్, ఖర్గే
TG: కాంగ్రెస్ చీఫ్ ఖర్గే, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఈ నెల 27న రాష్ట్రంలో పర్యటించనున్నారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా నిర్వహిస్తున్న ‘సంవిధాన్ బచావో’ కార్యక్రమంలో వారు పాల్గొంటారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్ తదితర కార్యక్రమాలను కాంగ్రెస్ దేశవ్యాప్తంగా నిర్వహించనున్న విషయం తెలిసిందే.