News May 21, 2024
ఓటీటీలోకి వచ్చేస్తోన్న విశాల్ ‘రత్నం’
హీరో విశాల్, ‘సింగం’ డైరెక్టర్ హరి కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం ‘రత్నం’. గత నెల 26న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ మాస్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమా ఈ నెల 23న ఓటీటీలోకి రానుంది. అమెజాన్ ప్రైమ్‌లో తెలుగు, తమిళ భాషల్లో అందుబాటులో ఉంటుందని చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ మూవీలో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటించారు.
Similar News
News January 9, 2025
TCS షేర్లకు రూ.76 డివిడెండ్
Q3లో TCS నికర లాభం 12% పెరిగి ₹12,380 కోట్లుగా నమోదైంది. గత ఏడాది ఇదే Dec క్వార్టర్‌లో లాభం ₹11,058 కోట్లుగా ఉంది. తాజా ఫలితాల వెల్లడి నేపథ్యంలో ఒక్కో షేరుకు ₹10 మధ్యంతర డివిడెండ్‌తోపాటు ₹66 స్పెషల్ డివిడెండ్ చెల్లించనున్నట్టు సంస్థ ప్రకటించింది. జనవరి 17ను రికార్డు డేట్‌గా ప్రకటించింది. ఫిబ్రవరి 3న డివిడెండ్ చెల్లించనుంది. ఫలితాల ప్రకటన నేపథ్యంలో గురువారం షేరు ధర 1.57% పతనమైంది.
News January 9, 2025
దిగ్గజ గాయకుడు జయచంద్రన్ మృతి
మలయాళ దిగ్గజ గాయకుడు పి జయచంద్రన్(80) ఈరోజు కన్నుమూశారు. ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారని ఆయన కుటుంబీకులు తెలిపారు. ఆరు దశాబ్దాలకు పైగా మలయాళ, తమిళ, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో 16వేలకు పైగా పాటలు పాడారు. ఉత్తమ గాయకుడిగా జాతీయ పురస్కారం పొందిన జయచంద్రన్‌కు 5సార్లు కేరళ రాష్ట్ర పురస్కారం, తమిళనాడు నుంచి కలైమామణి అవార్డుతో పాటు నాలుగు రాష్ట్ర ప్రభుత్వ పురస్కారాలు లభించాయి.
News January 9, 2025
మన్ కీ బాత్ వినాల్సిందే: గోవా ప్రభుత్వం
అన్ని ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు తప్పనిసరిగా ప్రధాన మంత్రి మన్ కీ బాత్ వినాలని గోవా ప్రభుత్వం ఆదేశించింది. ఈ కార్యక్రమంలో ప్రధాని లేవనెత్తే అంశాలు, సలహాల నుంచి స్ఫూర్తి పొందాలని సర్క్యులర్‌లో పేర్కొంది. ప్రభుత్వ పాలనను మెరుగుపరిచేందుకు వాటిలో ఉత్తమ విధానాలను అమలు చేయాలని సూచించింది. ప్రగతిశీల పాలనా పద్ధతులను అమలు చేయడంలో గోవా మార్గదర్శకమని సీఎం ప్రమోద్ సావంత్ అన్నారు.