News January 9, 2025
TCS షేర్లకు రూ.76 డివిడెండ్
Q3లో TCS నికర లాభం 12% పెరిగి ₹12,380 కోట్లుగా నమోదైంది. గత ఏడాది ఇదే Dec క్వార్టర్‌లో లాభం ₹11,058 కోట్లుగా ఉంది. తాజా ఫలితాల వెల్లడి నేపథ్యంలో ఒక్కో షేరుకు ₹10 మధ్యంతర డివిడెండ్‌తోపాటు ₹66 స్పెషల్ డివిడెండ్ చెల్లించనున్నట్టు సంస్థ ప్రకటించింది. జనవరి 17ను రికార్డు డేట్‌గా ప్రకటించింది. ఫిబ్రవరి 3న డివిడెండ్ చెల్లించనుంది. ఫలితాల ప్రకటన నేపథ్యంలో గురువారం షేరు ధర 1.57% పతనమైంది.
Similar News
News January 22, 2025
వాముతో లాభాలెన్నో!
వాములో చాలా ఔషధ గుణాలున్నాయని ఆయుర్వేద వైద్య నిపుణులు చెబుతున్నారు. దాన్ని నమలడం వల్ల నోట్లోని బ్యాక్టీరియా నశించడంతో పాటు చిగుళ్ల వాపులు తగ్గుతాయి. రోజూ తీసుకుంటే శరీర మెటబాలిజం పెరిగి బరువు తగ్గుతారు. వాములోని యాంటీ స్పాస్మోడిక్ గుణాలు కడుపునొప్పి, అజీర్తికి దివ్యౌషధంగా పనిచేస్తాయి. జలుబు ఉన్నవారు వాముగింజలను పొడి చేసి వస్త్రంలో చుట్టి వాసన పీల్చితే ఉపశమనం లభిస్తుంది.
News January 22, 2025
హార్దిక్, నేను మంచి ఫ్రెండ్స్: SKY
హార్దిక్ పాండ్యా, తాను మంచి స్నేహితులం అని సూర్య కుమార్ యాదవ్ అన్నారు. ‘చాలా కాలంగా కలిసి క్రికెట్ ఆడుతున్నాం. గ్రౌండ్‌లోనే కాకుండా బయటా మేము మంచి ఫ్రెండ్స్. IPL ప్రారంభం కాగానే కెప్టెన్సీ అతనికి అప్పగించి కాస్త రిలాక్స్ అవుతా’ అని సూర్య అన్నారు. ఇంగ్లండ్‌తో T20లకు హార్దిక్‌ను కాదని అక్షర్‌ను VCగా నియమించడంతో హార్దిక్, సూర్య మధ్య విబేధాలు ఉన్నాయనే వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో SKY స్పందించారు.
News January 22, 2025
కేజ్రీవాల్‌పై బీజేపీ ‘చునావీ హిందూ’ ఎటాక్
రామాయణంలోని ఓ అంశాన్ని ఆప్ అధినేత కేజ్రీవాల్ తప్పుగా చెప్పడంపై ఢిల్లీ ఎన్నికల వేళ BJP ఆయనపై ఎటాక్ చేస్తోంది. ‘చునావీ(ఎన్నికల) హిందూ’ అంటూ విమర్శిస్తోంది. ఆయన సనాతన ధర్మాన్ని కించపరిచారని ఢిల్లీ BJP అధ్యక్షుడు V. సచ్‌దేవా మండిపడ్డారు. ఎన్నికలప్పుడే ఆయనకు ఆలయాలపై ప్రేమ పుట్టుకొస్తుందని ఎద్దేవా చేశారు. BJP నేతలు రావణుడిని ఇష్టపడుతున్నారని, వారి స్వభావం అలాంటిదే అని కేజ్రీవాల్ ఎదురుదాడికి దిగారు.