News May 22, 2024
శ్రీకాకుళం: గ్రామాల్లో శాంతియుత వాతావరణం ఉండాలి

ఎన్నికలు పోలింగ్ అనంతరం గ్రామాల్లో శాంతియుత వాతావరణం నెలకొల్పేలా పోలీసులు చర్యలు చేపట్టారు. శ్రీకాకుళం ఎస్పీ రాధిక ఆదేశాలతో జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ పరిధిలోని సీఐలు, ఎస్సై ల ఆధ్వర్యంలో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. జిల్లా అంతటా 144 సెక్షన్ అమల్లో ఉందని ప్రజలకు గుర్తు చేశారు. కార్యకర్తలు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టినట్లు పోలీసులు పేర్కొన్నారు.
Similar News
News April 16, 2026
నరసన్నపేట: ‘ముద్దాయిలకు న్యాయవాదులను ఏర్పాటు చేస్తాం’

నరసన్నపేటలోని స్థానిక సబ్ జైలును జిల్లా న్యాయాధికార సేవా సంస్థ కార్యదర్శి హరిబాబు ఆకస్మికంగా పరిశీలించారు. గురువారం మధ్యాహ్నం సబ్ జైలుకు చేరుకున్న ఆయన ఖైదీల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ..బెయిల్ కోసం ప్రయత్నం చేసే ముద్దాయిలకు న్యాయాధికారి సేవా సంస్థ తరఫున ఉచితంగా న్యాయవాదులను ఏర్పాటు చేస్తామన్నారు. కార్యక్రమంలో సబ్ జైలు సూపరింటెండెంట్ వినయ్ కుమార్ ఉన్నారు.
News April 16, 2026
పాలిసెట్‌కు ఏర్పాట్లు పూర్తి చేయాలి: కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్

శ్రీకాకుళం జిల్లాలో ఏప్రిల్ 25వ తేదీన నిర్వహించనున్న పాలిటెక్నిక్ ప్రవేశపరీక్ష (పాలిసెట్-2026)కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. గురువారం సంబంధించిన అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 11,855 మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరు కానున్నారని అన్నారు. 42 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు.
News April 16, 2026
గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే కూటమి లక్ష్యం: మంత్రి అచ్చెన్న

టెక్కలి నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో ఎలాంటి అలసత్వం ప్రదర్శించరాదని మంత్రి అచ్చెన్న అధికారులను హెచ్చరించారు. గురువారం కోటబొమ్మాళి మండలం నిమ్మాడలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో ఇరిగేషన్, రహదారులు, ఎన్‌ఆర్‌ఈజీఎస్, గ్రామీణ నీటి సరఫరా, పంచాయతీరాజ్ శాఖలకు చెందిన డీఈ, ఏఈలు, ఇతర అధికారులతో సమీక్ష నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు.


