News May 22, 2024
ఈరోజు నమాజ్ వేళలు
తేది: మే 22, బుధవారం
ఫజర్: తెల్లవారుజామున 4:22 గంటలకు సూర్యోదయం: ఉదయం 5:42 గంటలకు జొహర్: మధ్యాహ్నం 12:13 గంటలకు అసర్: సాయంత్రం 4:46 గంటలకు
మఘ్రిబ్: రాత్రి 6:44 గంటలకు
ఇష: రాత్రి 08.04 గంటలకు
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
Similar News
News January 11, 2025
సంక్రాంతి పండుగ ఎందుకు జరుపుకుంటారంటే?
సంక్రాంతి రైతుల పండుగ. ఈ పండుగ నాటికి అన్నదాతలు ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యం ఇంటికి చేరుతుంది. ఆ సంతోషంలోనే ఈ పండుగ జరుపుకుంటారు. తమకు సహాయం చేసిన పశువులను పూజిస్తారు. కూలీలకు పండిన ధాన్యంలో కొంత ఇస్తారు. గంగిరెద్దులు, హరిదాసులు, జంగాలు అందరూ సంక్రాంతికే కనిపిస్తారు. వారందరికీ ప్రజలు సంతోషంగా దానధర్మాలు చేస్తారు. ప్రజలు ఒకరితో మరొకరు కృతజ్ఞతతో మెలగాలని చాటి చెప్పడమే ఈ పండుగ ఉద్దేశం.
News January 11, 2025
‘గేమ్ ఛేంజర్’ టికెట్ రేట్ల పెంపు ఉత్తర్వుల ఉపసంహరణ
TG: గేమ్ ఛేంజర్ మూవీకి ప్రభుత్వం మరో బిగ్ షాకిచ్చింది. టికెట్ ధరలను పెంచుకోవచ్చంటూ గతంలో ఇచ్చిన ఉత్తర్వులను ఉపసంహరించుకుంది. హైకోర్టు ఆదేశాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఇప్పటికే తెల్లవారుజాము <<15130242>>స్పెషల్ షోలను రద్దు<<>> చేసిన విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రజల ఆరోగ్యం, భద్రత దృష్ట్యా ఇకపై స్పెషల్ షోలకు అనుమతి ఇవ్వబోమని స్పష్టం చేసింది. ప్రభుత్వ నిర్ణయంతో మూవీ కలెక్షన్లపై ప్రభావం పడనుంది.
News January 11, 2025
ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు ప్రకటన
ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌కు మహ్మద్ షమీని BCCI ఎంపిక చేసింది. అలాగే ఈ జట్టులో తెలుగు కుర్రాళ్లు తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి చోటు దక్కించుకున్నారు. జట్టు: సూర్య (C), శాంసన్, అభిషేక్, తిలక్, నితీశ్, జురేల్, రింకూ, హార్దిక్, అక్షర్, షమీ, అర్ష్‌దీప్, హర్షిత్, బిష్ణోయ్, వరుణ్, సుందర్. కాగా ఈ నెల 22 నుంచి ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచుల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ కోల్‌కతాలో జరగనుంది.