News May 22, 2024

IPL ఫైనల్ చేరే రెండు జట్లివే: ఏబీడీ

image

ఈ IPL సీజన్‌లో ఫైనల్ మ్యాచ్ కేకేఆర్, RCB మధ్య జరుగుతుందని దక్షిణాఫ్రికా మాజీ ప్లేయర్ AB డివిలియర్స్ అన్నారు. ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. దక్షిణాఫ్రికా ప్లేయర్లు ఎక్కువగా ఉండటంతో SRH ఆటను తాను ఎంజాయ్ చేస్తున్నట్లు తెలిపారు. ఈ టోర్నమెంట్‌లో బెస్ట్ టీమ్ KKR అని చెప్పుకొచ్చారు. KKR ఫైనల్ వెళితే.. చెన్నై వేదికగా జరిగే ఫైనల్లో స్పిన్నర్లు ఉన్న కోల్‌కతాకే ఎక్కువగా అడ్వాంటేజ్ ఉందన్నారు.

Similar News

News April 19, 2026

చదువు ప్రాధాన్యం తెలుసుకోండి!

image

విద్యలేనివాడు విధ్వాంసుచేరువ
నుండగానే పండితుండుగాడు
కొలని హంసలకదా గొక్కెర లున్నట్లు
విశ్వదాభిరామ! వినుర వేమ!!
తాత్పర్యం: అందమైన హంసలతో కలిసి తిరిగినంత మాత్రాన కొంగ ఎప్పటికీ హంస కాలేదు. అలాగే చదువు రానివాడు, నేర్చుకోవాలనే కుతూహలం లేని వాడు విద్వాంసుల దగ్గర ఉన్నప్పటికీ పండితుడు కాలేడు. అందుకే ప్రతి ఒక్కరికీ చదువు అనేది చాలా ముఖ్యం.
<<-se>>#PADHYAM<<>>

News April 19, 2026

టిమ్ డేవిడ్.. IPLలో అరుదైన మైల్‌స్టోన్

image

ఢిల్లీ క్యాపిటల్స్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు హిట్టర్ టిమ్ డేవిడ్ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు. IPLలో అతి తక్కువ బంతుల్లో (560) వెయ్యి పరుగులు పూర్తి చేసిన రెండో ఆటగాడిగా నిలిచారు. ఆండ్రీ రస్సెల్ (545 బంతులు) తర్వాత ఆయనే టాప్. అంతేకాదు కనీసం వెయ్యి పరుగులు చేసిన వారిలో 175 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్ ఉన్న ఏకైక బ్యాటర్ డేవిడ్ కావడం విశేషం.

News April 19, 2026

ఈ ఏడాదే ₹1.85 లక్షలకు 10గ్రా బంగారం?

image

ఈ ఏడాది చివరినాటికి 10 గ్రాముల బంగారం ధర రూ.1.85 లక్షలకు చేరే అవకాశం ఉందని యాక్సిస్ డైరెక్ట్ అంచనా వేసింది. అంతర్జాతీయ ఉద్రిక్తతలు, లోకల్ డిమాండ్ పెరగడమే ఇందుకు కారణమని పేర్కొంది. గతేడాది అక్షయ తృతీయ నుంచి ఇప్పటివరకు ధరలు 60% పెరిగాయని వెల్లడించింది. స్టాక్ మార్కెట్ కంటే బంగారంపై పెట్టుబడే మంచి లాభాలను ఇస్తోందని నివేదిక తెలిపింది.