News May 22, 2024

24 నుంచి ఇంటర్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్

image

AP: ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు ఈ నెల 24 నుంచి జూన్ 1వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఫస్టియర్ విద్యార్థులకు ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, సెకండియర్ స్టూడెంట్స్‌కి మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5.30 వరకు పరీక్షలు జరుగుతాయి. మొదటి సంవత్సరం ఇంటర్‌లో 3,46,393 మంది, సెకండియర్‌లో 1,21,545 మంది విద్యార్థులున్నారు. వివరాలకు 08645-277702, 18004251531 నంబర్లలో సంప్రదించవచ్చు. పరీక్షల టైం టేబుల్‌ను పైఫొటోలో చూడొచ్చు.

Similar News

News April 16, 2026

WGL: వైద్య విద్యార్థుల పరీక్షలో లోపభూయిష్ఠం..!

image

కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయ పరిధిలో MBBS ఫైనల్ ఇయర్ పేపర్-1 పరీక్ష నిన్న జరిగింది. ఇందులో పేపర్-2లో రావాల్సిన ప్రశ్నలు వచ్చాయి. 5 వేల మంది ప్రశ్నించడంతో యూనివర్సిటీ అధికారులు 15న పరీక్ష రద్దు చేస్తున్నామని, తిరిగి ఈనెల 27న నిర్వహిస్తామని వెబ్ నోట్ పోస్ట్ చేశారు. అయితే టెక్నికల్ సమస్య అని వారు చెప్పడం గమనార్హం. అధికారులు నిత్యం ఇలాంటి తప్పులు చేస్తున్నారని పేరెంట్స్ ఆరోపిస్తున్నారు.

News April 16, 2026

ఏపీలో సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రారంభం.. వివరాలు నమోదు చేసుకున్న సీఎం

image

AP: స్వీయ జనగణనలో భాగంగా CM చంద్రబాబు తన వివరాలను ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా నమోదు చేసుకున్నారు. http://se.census.gov.in సైట్ ద్వారా మొత్తం 33 ప్రశ్నలతో కూడిన ఈ సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రక్రియను ఏపీ జనగణన డైరెక్టర్ జె.నివాస్ సీఎంకు వివరించారు. ఈ నెల 30 వరకు ప్రజలు ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేసుకోవచ్చని చెప్పారు. మే 1 తేదీ నుంచి 30 వరకూ అధికారులు క్షేత్రస్థాయిలో ఇళ్ల గణన ప్రక్రియను చేపడతారని తెలిపారు.

News April 16, 2026

గుడిలో దర్శనం తర్వాత ఎందుకు కూర్చోవాలి?

image

ఆలయం ప్రశాంతతకు నిలయం. దైవ దర్శనంతో మనలోని కోపం, అహంకారం, స్వార్థం తాత్కాలికంగా దూరమవుతాయి. దర్శనం ముగిసిన వెంటనే జనబాహుళ్యంలోకి వెళ్తే మనసు మళ్లీ పాత ధోరణిలోకి వెళ్ళే అవకాశం ఉంది. అందుకే కాసేపు ప్రశాంతంగా కూర్చుంటే, ఆ దేవాలయంలో జరిగే యజ్ఞ యాగాది క్రతువుల పుణ్య ఫలం వల్ల మనసులోని కల్మషం కరిగిపోతుంది. తద్వారా మనసు ప్రశాంతంగా మారి, కొంత సమయమైనా ఆరోగ్యకరమైన, ఆహ్లాదకరమైన స్థితిని మనం పొందగలుగుతాము.