News May 22, 2024
అంచనాలకు మించి జీడీపీ వృద్ధి: నిపుణులు
FY24 చివరి త్రైమాసికంలో భారత్ ఆర్థిక వృద్ధి అంచనాకు (6.8%) మించి నమోదయ్యే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. గణనీయంగా పెరుగుతున్న డిమాండే ఇందుకు కారణమంటున్నారు. క్యూ4 ఫలితాల ప్రభావంతో FY24 GDP 7.8% రికార్డ్ కావొచ్చని తెలిపారు. ఫిబ్రవరిలో కేంద్రం వేసిన అంచనా (7.6%) కంటే ఇది ఎక్కువ. మరోవైపు ఐఎంఎఫ్ 7.8% వృద్ధి సాధిస్తుందని అంచనా వేయడం గమనార్హం. కాగా ఈనెల 31న కేంద్రం FY24 జీడీపీ డేటా రిలీజ్ చేయనుంది.
Similar News
News December 26, 2024
తెలంగాణలో ముసురు..
తెలంగాణలో భిన్నమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడ్డాయి. మంగళవారం నుంచి రాత్రి ఉష్ణోగ్రతలు పెరుగుతుండగా, పగటిపూట టెంపరేచర్లు భారీగా పడిపోతున్నాయి. చాలా జిల్లాల్లో పగటి పూట ఉష్ణోగ్రతలు 25 డిగ్రీలుగా రికార్డయ్యాయి. మహబూబాబాద్, ములుగు, వరంగల్ జిల్లాల్లో అకాల వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ నగరంలో నిన్నటి నుంచి చిరుజల్లులు పడుతున్నాయి. వాతావరణం చల్లగా మారిపోయింది.
News December 26, 2024
ప్రముఖ రచయిత, డైరెక్టర్ వాసుదేవన్ కన్నుమూత
ప్రముఖ మలయాళ రచయిత, డైరెక్టర్ ఎంటీ వాసుదేవన్ నాయర్(91) అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన మరణం పట్ల కేరళ CM విజయన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇవాళ, రేపు సంతాప దినాలుగా ప్రకటించారు. మలయాళ సాహిత్యంలో ఆయన కృషికిగాను 1995లో కేంద్రం జ్ఞానపీఠ అవార్డును బహూకరించింది. పలుచిత్రాలకు స్క్రిప్ట్ రైటర్, డైరెక్టర్‌గా పనిచేశారు. ఈయన ఎన్నో నవలలు, షార్ట్ స్టోరీలు రాశారు. ఆయన నాలుగు సినిమాలకు నేషనల్ అవార్డులు వచ్చాయి.
News December 26, 2024
సీఎంతో నేడు సినీ ప్రముఖుల భేటీ.. వివాదం ముగిసేనా?
TG: సంధ్య థియేటర్ ఘటన అనంతరం పరిణామాల నేపథ్యంలో నేడు CM రేవంత్‌తో సినీ ప్రముఖులు సమావేశం కానున్నారు. ఉ.10 గంటలకు పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో జరిగే ఈ భేటీలో దిల్ రాజు, చిరంజీవి, వెంకటేశ్, అల్లు అరవింద్ తదితరులు పాల్గొంటారు. బన్నీ వివాదం, బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపు తదితర అంశాలపై ప్రధానంగా చర్చించనున్నారు. త్వరగా సమస్య సమసిపోవాలని ప్రభుత్వ పెద్దలు, సినీ స్టార్లు కోరుకుంటున్నారు.