News May 22, 2024

పర్సెంటేజీ ఇస్తేనే సినిమాల ప్రదర్శన: ఫిల్మ్ ఎగ్జిబిటర్లు

image

నిర్మాతలు మల్టీప్లెక్స్‌లకు ఇచ్చినట్లు తమకూ పర్సెంటేజీ ఇస్తేనే చిత్రాలను ప్రదర్శిస్తామని ఫిల్మ్ ఎగ్జిబిటర్లు స్పష్టం చేశారు. దీనిపై నిర్ణయం తీసుకునేందుకు జూలై 1వరకు గడువు విధించారు. అటు ఇకపై అద్దె ప్రాతిపదికన ప్రదర్శనలు ఉండవని తేల్చిచెప్పారు. ముందస్తు ఒప్పందంతో కల్కి, పుష్ప2, గేమ్ ఛేంజర్, భారతీయుడు-2 మూవీలకు మినహాయింపు ఉంటుందన్నారు. మరోవైపు ఇకపై బెనిఫిట్ షోలు, అదనపు ఆటలూ ప్రదర్శించబోమన్నారు.

Similar News

News January 12, 2025

గ్రేటర్‌లో అండర్ గ్రౌండ్ విద్యుత్: సీఎం రేవంత్

image

TG: గ్రేటర్‌ హైదరాబాద్‌లో భూగర్భ విద్యుత్ కేబుల్ ఏర్పాటుకు అధ్యయనం చేయాలని అధికారులకు సూచించారు. విద్యుత్ శాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఔటర్ రింగ్ రోడ్డు వరకు ఈ విధానం ఉండాలని సూచించారు. ఇతర దేశాల్లో బెస్ట్ విధానాన్ని పరిశీలించి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. విద్యుత్‌తో పాటు అన్ని రకాల కేబుల్స్ అండర్ గ్రౌండ్‌లోనే ఉండేలా చూడాలన్నారు.

News January 12, 2025

కేజ్రీవాల్‌కు అమిత్ షా కౌంటర్

image

రమేశ్ బిధూరీని బీజేపీ సీఎంగా అభ్యర్థిగా ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ పేర్కొనడంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కౌంటర్ ఎటాక్ చేశారు. ‘బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిని కేజ్రీవాల్ నిర్ణయిస్తారా? అలాంటి వ్యాఖ్యలు చేసేందుకు ఆయన ఎవరు?’ అని షా ప్రశ్నించారు. కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన రమేశ్ ఇటీవల దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే.

News January 12, 2025

80 మంది విద్యార్థినుల చొక్కాలు విప్పించిన ప్రిన్సిపల్

image

ఝార్ఖండ్‌లో ఓ ప్రైవేట్ పాఠశాలలో దారుణం చోటుచేసుకుంది. ఓ ప్రిన్సిపల్ 80 మంది విద్యార్థినుల చొక్కాలను విప్పి ఇంటికి పంపారు. ధన్‌బాద్ జిల్లాలోని ఓ ప్రైవేట్ స్కూల్‌లో టెన్త్ పరీక్షలు ముగియడంతో విద్యార్థినులు ‘పెన్ డే’ నిర్వహించారు. ఒకరి చొక్కాలపై మరొకరు సంతకం చేసుకున్నారు. ఇది చూసిన ప్రిన్సిపల్ వారి చొక్కాలను విప్పించారు. బ్లేజర్లతోనే విద్యార్థినులను ఇంటికి పంపారు. దీనిపై పోలీసుల విచారణ జరుగుతోంది.