News May 22, 2024
ఆర్మీ జనరల్‌తో జైశంకర్ భేటీ.. మతలబేంటో?
భారత ఆర్మీ స్టాఫ్ చీఫ్ జనరల్ మనోజ్ పాండేతో విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్ భేటీ అయ్యారు. ఇది మర్యాదపూర్వక భేటీ అని మంత్రి తెలిపారు. కాగా.. POK మనదేనని, దాన్ని ఎలాగైనా స్వాధీనం చేసుకుంటామని ఇటీవల కేంద్రం పదేపదే చెబుతున్న వేళ ఈ భేటీపై రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి. పాక్ ఆక్రమిత కశ్మీర్‌కు సంబంధించి ఏదో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
Similar News
News January 12, 2025
‘డాకు మహారాజ్’ పబ్లిక్ టాక్
బాలకృష్ణ, బాబీ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం ‘డాకు మహారాజ్’. యూఎస్‌లో సినిమా ప్రీమియర్లు మొదలయ్యాయి. మూవీలో బాలకృష్ణ నటన, డైలాగ్స్ అదిరిపోయాయని.. తమన్ మ్యూజిక్ ఇరగదీశారని కామెంట్లు చేస్తున్నారు. సినిమా చివరి 30 నిమిషాలు ఊహించేలా ఉంటుందని అంటున్నారు. మొత్తానికి ఈ మూవీ బాలయ్య అభిమానులకు పసందైన విందు లాంటిదని చెబుతున్నారు. మరికాసేపట్లో WAY2NEWS రివ్యూ.
News January 12, 2025
వారికి రైతు భరోసా ఇవ్వం: మంత్రి పొంగులేటి
TG: రైతు భరోసా విషయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. యోగ్యమైన భూమి ఉన్నవారికి పథకం అమలు చేస్తామని చెప్పారు. రియల్ ఎస్టేట్ భూములకు మాత్రం ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం చెల్లించదని స్పష్టం చేశారు. మరోవైపు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల విషయంలో ప్రత్యర్థుల రెచ్చగొట్టే చర్యలకులోను కావొద్దన్నారు. అర్హులను గుర్తించి నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున ఇస్తామని తెలిపారు.
News January 12, 2025
మాంజాపై నిషేధాన్ని అమలు చేయండి: హైకోర్టు
TG: గాలిపటాలకు నైలాన్ దారాలను లేదా మాంజాను ఉపయోగించకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. వీటి విక్రయాన్ని నిషేధిస్తూ 2017లో NGT ప్రధాన బెంచ్ వెల్లడించిన తీర్పును అమలు చేయాలని పేర్కొంది. ఉత్తర్వుల అమలుపై వివరాలు సమర్పించాలని హోం, అటవీ, పర్యావరణ శాఖల సీఎస్‌లకు, డీజీపీకి నోటీసులు జారీ చేసింది. ఎన్జీటీ ఉత్తర్వులను అమలు చేయకపోవడాన్ని సవాల్ చేస్తూ ఓ వ్యక్తి కోర్టును ఆశ్రయించారు.