News January 12, 2025

వారికి రైతు భరోసా ఇవ్వం: మంత్రి పొంగులేటి

image

TG: రైతు భరోసా విషయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. యోగ్యమైన భూమి ఉన్నవారికి పథకం అమలు చేస్తామని చెప్పారు. రియల్ ఎస్టేట్ భూములకు మాత్రం ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం చెల్లించదని స్పష్టం చేశారు. మరోవైపు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల విషయంలో ప్రత్యర్థుల రెచ్చగొట్టే చర్యలకులోను కావొద్దన్నారు. అర్హులను గుర్తించి నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున ఇస్తామని తెలిపారు.

Similar News

News November 7, 2025

స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు

image

నిన్న పెరిగిన బంగారం ధరలు ఇవాళ కాస్త తగ్గి కొనుగోలుదారులకు ఉపశమనాన్నిచ్చాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.550 తగ్గి రూ.1,22,020కు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.470 పతనమై రూ.1,11,880 పలుకుతోంది. అటు వెండి ధరల్లో ఎలాంటి మార్పులేదు. కేజీ సిల్వర్ రేటు రూ.1,65,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.

News November 7, 2025

సూర్య బ్యాడ్ ఫామ్.. 18 ఇన్నింగ్సుల్లో నో ఫిఫ్టీ!

image

IND టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఫామ్ ఆందోళన కలిగిస్తోంది. అతడు గత 18 టీ20ల్లో ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేకపోయారు. 7 సార్లు(+3 డకౌట్లు) సింగిల్ డిజిట్ స్కోర్‌కే ఔటయ్యారు. అత్యధిక స్కోర్ 47*. కెప్టెన్సీ భారం వల్లే సూర్య ఫెయిల్ అవుతున్నారా? లేదా బ్యాటింగ్ ఆర్డర్‌లో పదేపదే మార్పుల వల్ల విఫలం అవుతున్నారా? అనే చర్చ మొదలైంది. వచ్చే ఏడాది T20WC నేపథ్యంలో సూర్య ఫామ్ అందుకోవాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

News November 7, 2025

రెండు శనివారాల్లో పనిపై పునరాలోచించండి: APTF

image

AP: తుఫాను కారణంగా స్కూళ్లకు ఇచ్చిన సెలవులకు పరిహారంగా రెండు శనివారాలు పనిచేయాలంటూ ఇచ్చిన ఉత్తర్వులను సమీక్షించాలని ఏపీటీఎఫ్ కోరింది. 220 పనిదినాలు సర్దుబాటయ్యే స్కూళ్లను ఈ ఉత్తర్వుల నుంచి మినహాయించాలంది. అలాగే నవంబర్ 10న మూడో కార్తీక సోమవారం, 14న బాలల దినోత్సవం సందర్భంగా గ్రామాల్లో సమ్మేటివ్ పరీక్షల షెడ్యూల్ మార్చాలని ఉపాధ్యాయ సంఘాలు కోరాయి.