News May 23, 2024

దుర్గమ్మ దర్శనానికి తరలివస్తున్న భక్తులు

image

AP: బెజవాడ ఇంద్రకీలాద్రి భక్తుల రద్దీతో కిటకిటలాడుతోంది. వేసవి సెలవులు కావడంతో సుదూర ప్రాంతాల నుంచి భక్తులు అమ్మవారి దర్శనం కోసం తరలివస్తున్నారు. రోజుకు 50 వేల మంది వరకు వస్తున్నారని.. రూ.25 లక్షల దాకా టిక్కెట్ల ఆదాయం వస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఎండల తీవ్రత దృష్ట్యా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.

Similar News

News April 20, 2026

రహానే చెత్త రికార్డు

image

నిన్న RRతో మ్యాచులో సున్నాకే ఔటైన KKR కెప్టెన్ రహానే IPLలో ఓ చెత్త రికార్డును మూటగట్టుకున్నారు. ఓపెనర్‌గా అత్యధిక సార్లు(12) డకౌట్ అయిన ప్లేయర్‌గా నిలిచారు. ఆ తర్వాతి స్థానాల్లో పార్థివ్ పటేల్(11), శిఖర్(10), గంభీర్(10), వార్నర్(9) ఉన్నారు. ఓవరాల్‌(బ్యాటింగ్ పొజిషన్‌తో సంబంధం లేకుండా)గా మ్యాక్స్‌వెల్(19) టాప్‌లో ఉన్నారు. కాగా సీజన్‌లో రహానే 7 మ్యాచుల్లో 25.33 యావరేజ్‌తో 152 రన్స్ చేశారు.

News April 20, 2026

అమానుషం.. కన్నపిల్లల్నే కాల్చి చంపాడు!

image

అమెరికాలోని లూసియానా కాల్పుల <<19693285>>కేసులో<<>> హృదయవిదారక విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడు కాల్చి చంపిన ఎనిమిది మంది పిల్లల్లో ఏడుగురు కన్నబిడ్డలే ఉన్నారు. మృతుల్లో ఏడాది చిన్నారి కూడా ఉంది. భార్య, మరో మహిళపైనా నిందితుడు కాల్పులు జరపగా వారి పరిస్థితి విషమంగా ఉంది. 2024 జనవరి తర్వాత USలో ఈ స్థాయిలో కాల్పులు జరగడం ఇదే తొలిసారి. పోలీసుల కాల్పుల్లో నిందితుడు చనిపోగా ఈ ఘటనకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

News April 20, 2026

సీఎం చంద్రబాబుపై సినిమా

image

AP: సీఎం చంద్రబాబు జీవితం, పరిపాలనా విశేషాలతో ‘ధర్మచక్రం’ సినిమాను నిర్మించినట్లు దర్శక, నిర్మాత పసుపులేటి వెంకట రమణ వెల్లడించారు. CBN బర్త్ డే సందర్భంగా ఇవాళ 13 జిల్లాల్లో ఈ చిత్రాన్ని ప్రదర్శిస్తామని తెలిపారు. చంద్రబాబు రాష్ట్రానికి చేస్తున్న సేవలను, ఆయనపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేలా ఇందులో వాస్తవాలను చూపించామని పేర్కొన్నారు.