News May 23, 2024
దుర్గమ్మ దర్శనానికి తరలివస్తున్న భక్తులు

AP: బెజవాడ ఇంద్రకీలాద్రి భక్తుల రద్దీతో కిటకిటలాడుతోంది. వేసవి సెలవులు కావడంతో సుదూర ప్రాంతాల నుంచి భక్తులు అమ్మవారి దర్శనం కోసం తరలివస్తున్నారు. రోజుకు 50 వేల మంది వరకు వస్తున్నారని.. రూ.25 లక్షల దాకా టిక్కెట్ల ఆదాయం వస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఎండల తీవ్రత దృష్ట్యా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.
Similar News
News April 18, 2026
KNR: ఎండ సుర్రుమంటోంది.. మీటర్ గిర్రుమంటోంది

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భానుడు నిప్పులు చెరుగుతున్నాడు. ఉష్ణోగ్రతలు 45°Cకి చేరుకోవడంతో ఎండలు సుర్రుమంటున్నాయి. దీంతో ప్రజలు ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లను విపరీతంగా వాడుతుండటంతో కరెంట్ మీటర్లు గిర్రున తిరుగుతున్నాయి. వారం రోజులుగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో రోజువారీ విద్యుత్ వినియోగం రెట్టింపు అయిందని, రాత్రి వేళలో విద్యుత్ లోడ్ గరిష్ఠ స్థాయికి చేరుతుందని అధికారులు చెబుతున్నారు.
News April 18, 2026
ప్రకాశం: కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా రుణాలు

ప్రకాశం జిల్లాలో ఆక్వా రంగాన్ని బలోపేతం చేసేందుకు కలెక్టర్ పి.రాజాబాబు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కలెక్టరేట్‌లో జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి చిన్న ఆక్వా రైతుకు కిసాన్ క్రెడిట్ కార్డ్(KCC) ద్వారా రుణ సదుపాయం కల్పించాలని బ్యాంకర్లను ఆదేశించారు. రుణాల మంజూరులో జాప్యం చేయరాదని స్పష్టం చేశారు. సమావేశంలో మత్స్యశాఖ, నాబార్డ్ అధికారులు, ఆక్వా రైతు ప్రతినిధులు పాల్గొన్నారు.