News May 23, 2024
వెంకీ-మనోజ్ కాంబోలో మూవీ?
అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో తెరకెక్కనున్న కొత్త చిత్రంలో వెంకటేశ్, మంచు మనోజ్ కలిసి నటిస్తున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటిస్తారని తెలుస్తోంది. విలేజ్ బ్యాక్ డ్రాప్ కథాంశంతో ఉండే ఈ మూవీని దిల్ రాజు నిర్మిస్తున్నారు. కాగా అనిల్ రూపొందించిన F2, F3 చిత్రాల్లో వెంకీ- వరుణ్ తేజ్ స్క్రీన్ షేర్ చేసుకున్న విషయం తెలిసిందే.
Similar News
News January 11, 2025
అది యాడ్ or వార్నింగ్? PIA ఫొటోపై సెటైర్లు
నాలుగేళ్ల తర్వాత పారిస్‌కు విమానాలను ప్రారంభిస్తున్నామంటూ పాక్ ఎయిర్‌లైన్స్ చేసిన పోస్టు ట్రోల్‌కు గురవుతోంది. ‘పారిస్.. మేం వస్తున్నాం’ అంటూ ఐఫిల్ టవర్ వైపు విమానం దూసుకెళ్తున్నట్లుగా ఆ ఫొటో ఉంది. దీంతో ‘US ట్విన్ టవర్స్‌పై లాడెన్ దాడి తరహాలో ప్లాన్ చేశారా? అది ప్రకటనా? లేక వార్నింగా?’ అని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. 2020లో కరాచీలో విమానం క్రాష్ తర్వాత ఆ ఎయిర్‌లైన్స్‌ను EU బ్యాన్ చేసింది.
News January 11, 2025
మస్క్ పిచ్చివాడవుతున్నారు: బయోగ్రఫీ రచయిత
టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఉండేకొద్దీ పిచ్చివాడవుతున్నారని ఆయన జీవిత కథ రాస్తున్న అబ్రామ్‌సన్ ఆరోపించారు. మస్క్ మానసిక ఆరోగ్యంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ‘మస్క్‌కు పిచ్చి ఎక్కుతోందని నేను బలంగా నమ్ముతున్నాను. ఆయన బయోగ్రాఫర్‌గా గడచిన రెండేళ్లుగా మస్క్ ఆన్‌లైన్ ప్రవర్తన నిశితంగా చూస్తున్నాను. భారీగా డ్రగ్స్ వాడకం, ఒత్తిడి కారణంగా ఎలాన్‌కు లోలోపల ఏదో తేడా చేసింది’ అని ట్వీట్ చేశారు.
News January 11, 2025
ఫిబ్రవరిలో ఫ్రాన్స్ టూర్‌కు ప్రధాని మోదీ
వచ్చే నెలలో భారత ప్రధాని నరేంద్ర మోదీ తమ దేశంలో పర్యటించనున్నట్లు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ వెల్లడించారు. ఆ నెల 11, 12 తేదీల్లో జరిగే ఏఐ సదస్సులో ఆయన పాల్గొంటారని పేర్కొన్నారు. కాగా గత ఏడాదిన్నరలో మోదీ ఫ్రాన్స్‌లో పర్యటించడం ఇది రెండోసారి. గతంలో 2023 జులైలో ఆయన అక్కడ పర్యటించారు. ఆ తర్వాత 2024 రిపబ్లిక్ వేడుకలకు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ విశిష్ఠ అతిథిగా భారత్‌కు వచ్చారు.