News May 23, 2024

ఎల్లుండి అమెరికాకు భారత ఆటగాళ్లు?

image

టీ20 వరల్డ్ కప్ కోసం ఈ నెల 25న టీమ్ఇండియా ప్లేయర్లు, సిబ్బంది అమెరికా వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ నుంచి నిష్క్రమించిన జట్లలోని ఆటగాళ్లు యూఎస్ విమానం ఎక్కనున్నట్లు సమాచారం. మొదట రోహిత్, కోహ్లీ, హార్దిక్, బుమ్రా, సూర్య, పంత్, అక్షర్, అర్ష్‌దీప్, కుల్దీప్, సిరాజ్‌ వెళ్లనుండగా.. ఐపీఎల్ ఫైనల్ తర్వాత మిగతా ప్లేయర్స్ అక్కడికి చేరుకోనున్నారట. దీనిపై బీసీసీఐ స్పందించాల్సి ఉంది.

Similar News

News January 30, 2026

నేను వెళ్లను.. పుతిన్‌నే రమ్మనండి: జెలెన్‌స్కీ

image

శాంతి చర్చల కోసం మాస్కోకు రావాలంటూ <<18997519>>రష్యా పంపిన ఆహ్వానాన్ని<<>> ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తిరస్కరించారు. ‘ట్రంప్, పుతిన్‌ను కలిసేందుకు నేను రెడీ. రష్యా తప్ప ఏ దేశానికైనా చర్చలకు వెళ్తా. నేనే పుతిన్‌ను కీవ్‌కు ఆహ్వానిస్తున్నా. ఆయన్ను రానివ్వండి.. అదీ ధైర్యం చేయగలిగితే’ అని అన్నారు. తాము యుద్ధాన్ని ముగించాలని అనుకుంటున్నామని, ఉద్రిక్తతలను తగ్గించే చర్యలకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

News January 30, 2026

గొడవలో ‘వెళ్లి చావు’ అనడం నేరమా?.. కేరళ హైకోర్టు కీలక తీర్పు

image

భార్యభర్తల గొడవలో ‘బయటికి వెళ్లి.. చావు’ అని అనడం ఆత్మహత్య ప్రేరేపితం కాదని కేరళ హైకోర్టు స్పష్టం చేసింది. ఇవే ఆరోపణలతో అరెస్టయిన ఓ వ్యక్తి శిక్షను రద్దు చేసింది. ప్రాసిక్యూషన్ ప్రకారం.. భర్త అక్రమ సంబంధంపై దంపతుల మధ్య వాగ్వాదం జరిగింది. కోపంలో భర్త ‘వెళ్లి.. చావు’ అని భార్యతో అన్నాడు. దీంతో ఆమె కూతురితో కలిసి సూసైడ్ చేసుకోవడంతో భర్తపై నమోదైన కేసును సెషన్స్ కోర్టు సమర్థించగా, హైకోర్టు కొట్టేసింది.

News January 30, 2026

నెయ్యి పేరుతో YCP రూ.250కోట్ల కుంభకోణం: జనసేన

image

AP: నెయ్యి వాడకుండానే దాని పేరుతో YCP ప్రభుత్వం రూ.250కోట్ల కుంభకోణం చేసిందని జనసేన ఆరోపించింది. ‘‘ఆవు నెయ్యికి బదులు ప్రమాదకర రసాయనాలతో 68లక్షల కిలోల సింథటిక్ నెయ్యి వాడి లడ్డూ ప్రసాదాన్ని TTD గత పాలకులు దోపిడీకి కేంద్రంగా చేసుకున్నారు. నెయ్యి సేకరణలో కుట్ర, ఫేక్ డాక్యుమెంట్ల వినియోగం, అధికార దుర్వినియోగంపై ఆధారాలున్నట్టు CBI నేతృత్వంలోని SIT దర్యాప్తులో తేలింది’’ అని SMలో పోస్టు పెట్టింది.