News May 24, 2024

ఓటుకు రూ.5,000.. ముగ్గురు టీచర్ల సస్పెండ్

image

AP: ప్రకాశం జిల్లా దర్శిలో ఓటు వేసేందుకు ఓ పార్టీ నుంచి పోస్టల్ బ్యాలెట్‌కు రూ.5,000 తీసుకున్న కేసులో ముగ్గురు టీచర్లను కలెక్టర్ దినేశ్ కుమార్ సస్పెండ్ చేశారు. సస్పెండ్ అయిన వారిలో గుత్తా నారాయణ, గోవిందు, అరుణకుమారి ఉన్నారు. కాగా ఇటీవల ఇదే తరహాలో పోస్టల్ బ్యాలెట్‌కు రూ.5,000 తీసుకున్నట్లు తేలడంతో మంగళగిరి ఎస్సై ఖాజాబాబును ఐజీ <<13278620>>సస్పెండ్<<>> చేసిన విషయం తెలిసిందే.

Similar News

News January 14, 2026

మణుగూరు: అద్భుతం.. భూగర్భ వేడి నీటితో విద్యుదుత్పాదన

image

ఏజెన్సీ ప్రాంతమైన పగిడేరు దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది. 1980లో సింగరేణి బొగ్గు అన్వేషణ కోసం వేసిన బోర్ల నుంచి సహజంగా ఉబికి వస్తున్న వేడి నీరు ఈ ప్రాంతానికి వరంగా మారింది. ఈ నీటితో రైతులు 2 పంటలు పండిస్తుండగా, దీని ఆధారంగా విద్యుదుత్పత్తి చేసేందుకు సింగరేణి సంస్థ దేశంలోనే తొలి ‘జియో థర్మల్ ప్లాంట్’ను నిర్మించింది. భూగర్భ ఉష్ణ శక్తితో విద్యుత్ ఉత్పాదన చేపట్టడం ఇదే తొలిసారి కావడం విశేషం.

News January 14, 2026

పతంగ్: Made In Dhoolpet

image

పతంగ్.. పండుగ 3 రోజులే కానీ, 365 రోజులు ధూల్‌పేటలో గాలిపటాల తయారీ ఉంటుందని మీకు తెలుసా?. అవును.. స్టేట్‌ వైడ్‌ వ్యాపారులు, నగరవాసులు అధికంగా ఇక్కడికే వస్తుంటారు. దీంతో లక్షల్లో పతంగులు సిద్ధం చేయాలి. హ్యాండ్‌మేడ్ కదా.. 5 రోజులకు ఒక్కరు 100 పేపర్ పతంగుల వరకు తయారీ చేయగలరు. అందుకే ఏడాది మొత్తం శ్రమించి 500 రకాల విభిన్న రూపాల్లో లక్షల్లో పతంగులు రెడీ చేస్తారు. పైఫొటోలో ఉన్న పతంగ్ Made In Dhoolpet.