News May 24, 2024
కౌంటింగ్ కేంద్రాల్లో హైస్పీడ్ ఇంటర్నెట్: సీఈవో ముకేశ్

AP: వచ్చే నెల 4న ఓట్ల లెక్కింపునకు పటిష్ఠ ఏర్పాట్లు చేయాలని అన్ని జిల్లాల అధికారులను CEO ముకేశ్ కుమార్ మీనా ఆదేశించారు. స్ట్రాంగ్ రూమ్‌ల నుంచి కౌంటింగ్ కేంద్రాలకు EVMలను తరలించడానికి ఒకవైపు, అభ్యర్థులు, ఏజెంట్లకు మరోవైపు మార్గం ఉండాలని సూచించారు. ఆ కేంద్రాల్లో హైస్పీడ్ ఇంటర్నెట్తో కంప్యూటర్లను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. వేగంగా డేటా ఎంట్రీ చేసేందుకు నిపుణులైన సిబ్బందిని నియమించుకోవాలని చెప్పారు.
Similar News
News December 28, 2025
త్వరలో ఒక్క సిగరెట్ ధర రూ.72

ఎక్సైజ్ డ్యూటీ పెంచి సిగరెట్లను కొనలేనంత భారం చేయడానికి కేంద్రం సిద్ధమవుతోంది. ప్రస్తుతం రూ.18కు కొంటున్న ఒక్క సిగరెట్ ధర త్వరలో రూ.72కు పెరగవచ్చని అధికారులు చెబుతున్నారు. సిగరెట్ల వినియోగాన్ని తగ్గించడానికి తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలు ఇవ్వడం లేదు. దీంతో రేట్లు పెంచేందుకు సెంట్రల్ ఎక్సైజ్ (అమెండ్మెంట్) బిల్-2025లో కేంద్రం ప్రపోజల్స్ పెట్టింది. దీనిపై అన్ని వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
News December 28, 2025
జమ్మూలో 30 మందికి పైగా ఉగ్రవాదులు!

జమ్మూ ప్రాంతంలో 30 మందికిపైగా పాకిస్థానీ ఉగ్రవాదులు ఉన్నట్లు నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో భద్రతా బలగాలు హైఅలర్ట్ ప్రకటించాయి. కొండలు, అడవులు, లోయల్లో విస్తృతంగా గాలింపు చర్యలు చేపడుతున్నాయి. ఉగ్రవాదుల కదలికలను గమనించేందుకు డ్రోన్లు, థర్మల్ ఇమేజర్లు, గ్రౌండ్ సెన్సార్లను ఉపయోగిస్తున్నారు. తీవ్ర చలిని తట్టుకుని.. ఉగ్రవాదుల కదలికలపై నిఘా ఉంచేందుకు పర్వత ప్రాంతాల్లో స్థావరాలను ఏర్పాటు చేశారు.
News December 28, 2025
ప్రముఖ ఫ్రెంచ్ నటి కన్నుమూత

ప్రముఖ ఫ్రెంచ్ నటి బ్రిగిట్టే బార్డోట్(91) మరణించారు. నటి, మోడల్, సింగర్‌గా ఆమెకు గుర్తింపు ఉంది. యానిమల్ రైట్స్ యాక్టివిస్ట్‌గానూ మంచి పేరు తెచ్చుకున్నారు. సదరన్ ఫ్రాన్స్‌లోని తన నివాసంలో ఆమె తుదిశ్వాస విడిచినట్లు ఇంటర్నేషనల్ మీడియా పేర్కొంది. మరణానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. గతనెల అనారోగ్య కారణాలతో ఆస్పత్రిలో చేరిన ఆమె వృద్ధాప్య సమస్యలతోనే మరణించి ఉండొచ్చన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.


