News May 24, 2024
కౌంటింగ్ కేంద్రాల్లో హైస్పీడ్ ఇంటర్నెట్: సీఈవో ముకేశ్

AP: వచ్చే నెల 4న ఓట్ల లెక్కింపునకు పటిష్ఠ ఏర్పాట్లు చేయాలని అన్ని జిల్లాల అధికారులను CEO ముకేశ్ కుమార్ మీనా ఆదేశించారు. స్ట్రాంగ్ రూమ్‌ల నుంచి కౌంటింగ్ కేంద్రాలకు EVMలను తరలించడానికి ఒకవైపు, అభ్యర్థులు, ఏజెంట్లకు మరోవైపు మార్గం ఉండాలని సూచించారు. ఆ కేంద్రాల్లో హైస్పీడ్ ఇంటర్నెట్‌తో కంప్యూటర్లను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. వేగంగా డేటా ఎంట్రీ చేసేందుకు నిపుణులైన సిబ్బందిని నియమించుకోవాలని చెప్పారు.
Similar News
News February 17, 2025
టెక్ సదస్సులో ప్రసంగించనున్న కేటీఆర్

ఈ నెల 27, 28 తేదీల్లో బెంగళూరులో జరిగే ‘టెక్ అండ్ ఇన్నోవేషన్ సమిట్’లో పాల్గొనాలని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTRకు ఆహ్వానం లభించింది. ఆ సదస్సులో ఆయన ప్రసంగించాలని నిర్వాహకులు ఆయన్ను కోరారు. ఆహ్వానాన్ని మన్నించిన కేటీఆర్, భవిష్య సాంకేతికాభివృద్ధి అనే అంశంపై కేటీఆర్ ప్రసంగిస్తారని తెలుస్తోంది. ప్రముఖ పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, వివిధ ప్రభుత్వాల ప్రతినిధులు ఇందులో పాల్గొననున్నారు.
News February 17, 2025
ఢిల్లీ సీఎం ఎంపిక నేడే?

ఢిల్లీ కొత్త సీఎం ఎవరన్న సస్పెన్స్‌కు నేడు తెరపడే ఛాన్స్ ఉంది. ఈరోజు రాజధానిలో జరిగే సమావేశంలో సీఎం పేరును ప్రకటించే అవకాశం ఉంది. ఆ పేరుపై హైకమాండ్ ఇప్పటికే స్పష్టతతో ఉన్నప్పటికీ బయటికి పొక్కకుండా జాగ్రత్త పడుతోంది. కేజ్రీవాల్‌పై విజయం సాధించిన పర్వేశ్ వర్మతో పాటు మాజీ విజేందర్ గుప్తా, సతీశ్ ఉపాధ్యాయ, ఆశిష్ సూద్, జితేంద్ర మహాజన్ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది.
News February 17, 2025
మంత్రివర్గ విస్తరణలో ఇద్దరు ఎమ్మెల్సీలు?

TG: మంత్రివర్గ విస్తరణలో ఇద్దరు MLCలకు చోటు కల్పించాలని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తున్నట్లు సమాచారం. CM రేవంత్ తాజా ఢిల్లీ పర్యటనలో ఈ విషయంపై చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. 6 మంత్రి పదవుల్లో 4 ఎమ్మెల్యేలకు, 2 ఎమ్మెల్సీలకు కేటాయించనున్నట్లు గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి. సీఎం రేవంత్‌కు అత్యంత నమ్మకమైన వరంగల్ నేతకు, ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన మరో నేతకు ఈ అవకాశం దక్కొచ్చని సమాచారం.