News May 24, 2024

బంగ్లా MP హత్య: స్నేహితుడే హంతకుడు

image

బంగ్లాదేశ్ ఎంపీ అన్వరుల్ అజీమ్ అనర్‌ను తన పాత స్నేహితుడే హత్య చేయించినట్లు కోల్‌కతా పోలీసులు నిర్ధారించారు. అజీమ్ హత్యకు ఆయన రూ.5 కోట్ల సుఫారీ ఇచ్చినట్లు గుర్తించారు. చికిత్స కోసం కోల్‌కతాకు వచ్చిన అజీమ్ అమెరికా పౌరసత్వం ఉన్న తన స్నేహితుడి ఇంట్లో ఉన్నారు. ఆ ఇంట్లోనే ఎంపీని హంతకులు ఊపిరాడకుండా చేసి చంపారు. అనంతరం మృతదేహాన్ని ముక్కలుగా చేశారు. ఇప్పటికే ఈ కేసులో పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు.

Similar News

News January 13, 2026

BREAKING: నల్గొండ జిల్లాలో విషాదం

image

నల్గొండ(D) మర్రిగూడ(M) చర్లగూడెం ప్రాజెక్టు ముంపు గ్రామమైన వెంకేపల్లిలో ఈరోజు విషాదం చోటు చేసుకుంది. SI కృష్ణారెడ్డి తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన దంపతులు గోగుల అంజయ్య, శారదకు ముగ్గురు సంతానం. వారిలో ఇద్దరు ఆడపిల్లలు, ఒక అబ్బాయి అక్షయ్ కుమార్(10). కాగా ప్రాజెక్టు మట్టి కోసం తవ్విన గుంతలో అక్షయ్ ఈతకు వెళ్లి మృతిచెందాడు. ఒక్కగానొక్క కుమారుడు మృతిచెందడంతో కుటుంబం శోకసముద్రంలో మునిగింది.

News January 13, 2026

ప్రభాస్ నన్ను వర్రీ కావద్దన్నారు: మారుతి

image

రాజాసాబ్ రిజల్ట్ విషయంలో ప్రభాస్ తనకు సపోర్ట్‌గా నిలిచినట్లు డైరెక్టర్ మారుతి తెలిపారు. ‘మూవీ గురించి ఎక్కువ అప్డేట్‌గా ఉన్నది ప్రభాసే. నిరంతరం నాతో టచ్‌లో ఉన్నారు. వర్రీ కావద్దన్నారు. కొత్త ప్రయత్నం చేశాం. ఆడియెన్స్‌కు చేరడానికి కొంత టైమ్ పడుతుందన్నారు. రీసెంట్‌గా ఓల్డ్ గెటప్ సీన్స్ యాడ్ చేశాక ఆయనకు మెసేజ్ చేశా. ఆ సీన్స్ అన్నీ పర్ఫెక్ట్‌గా సెట్ అయ్యాయని అన్నారు’ అని మీడియా సమావేశంలో తెలిపారు.

News January 13, 2026

వైద్య శాఖకు ₹567 కోట్ల కేంద్ర నిధులు: మంత్రి

image

AP: రాష్ట్ర వైద్య శాఖకు కేంద్రం ₹567 కోట్లు విడుదల చేసిందని మంత్రి సత్యకుమార్ తెలిపారు. 15వ ఆర్థిక సంఘం కింద ఇచ్చే ₹2600 కోట్లలో ఇవి చివరి విడత నిధులన్నారు. PHC భవనాలు, డయాగ్నొస్టిక్ పరికరాలు, ఇతర అభివృద్ధి పనులకు వీటిని వినియోగిస్తారు. కాగా FY25-26 నిధులు, ఖర్చుపై మంత్రి సమీక్షించారు. కేంద్ర నిధులను పూర్తిగా సాధించాలని అధికారులను ఆదేశించారు. విఫలమైతే సంబంధిత అధికారులే బాధ్యులని స్పష్టం చేశారు.