News May 24, 2024
బంగ్లా MP హత్య: స్నేహితుడే హంతకుడు

బంగ్లాదేశ్ ఎంపీ అన్వరుల్ అజీమ్ అనర్‌ను తన పాత స్నేహితుడే హత్య చేయించినట్లు కోల్‌కతా పోలీసులు నిర్ధారించారు. అజీమ్ హత్యకు ఆయన రూ.5 కోట్ల సుఫారీ ఇచ్చినట్లు గుర్తించారు. చికిత్స కోసం కోల్‌కతాకు వచ్చిన అజీమ్ అమెరికా పౌరసత్వం ఉన్న తన స్నేహితుడి ఇంట్లో ఉన్నారు. ఆ ఇంట్లోనే ఎంపీని హంతకులు ఊపిరాడకుండా చేసి చంపారు. అనంతరం మృతదేహాన్ని ముక్కలుగా చేశారు. ఇప్పటికే ఈ కేసులో పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు.
Similar News
News February 14, 2025
రంజీ సెమీస్‌లో ఆడనున్న జైస్వాల్

ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో చోటు కోల్పోయిన టీమ్ఇండియా ఓపెనర్ జైస్వాల్ రంజీ ట్రోఫీ సెమీ ఫైనల్లో ఆడనున్నారు. ఈనెల 17 నుంచి నాగ్‌పూర్‌లో విదర్భతో మ్యాచులో ముంబై తరఫున బరిలోకి దిగనున్నారు. తొలుత ప్రకటించిన CT జట్టులో జైస్వాల్ పేరు ఉన్నప్పటికీ తర్వాత అతని స్థానంలో వరుణ్ చక్రవర్తిని ఎంపిక చేశారు. జైస్వాల్‌ను నాన్ ట్రావెలింగ్ సబ్స్టిట్యూట్స్ లిస్టులో చేర్చారు. అతడు జట్టుకు అవసరమైనప్పుడు దుబాయ్ వెళ్తారు.
News February 14, 2025
రేపు కందుకూరులో సీఎం చంద్రబాబు పర్యటన

AP: ‘స్వచ్ఛ ఆంధ్ర- స్వచ్ఛ దివస్’లో భాగంగా CM చంద్రబాబు రేపు నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఉ.11.45కు ఆయన కందుకూరు TRR కాలేజీలో హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన వెళ్లి 12.05కు దూబగుంట శివారులోని వేస్ట్ ప్రాసెసింగ్ యూనిట్‌ను ప్రారంభిస్తారు. అనంతరం స్థానికులతో కలిసి పారిశుద్ధ్య కార్యక్రమంలో పాల్గొంటారు. తర్వాత మార్కెట్ యార్డుకు చేరుకొని ప్రజలతో ముఖాముఖి నిర్వహిస్తారు.
News February 14, 2025
MLC ఎలక్షన్స్: బరిలో 90 మంది

TG: ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. 3 స్థానాలకు మొత్తం 90 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. కరీంనగర్-ఆదిలాబాద్-నిజామాబాద్-మెదక్ గ్రాడ్యుయేట్ స్థానానికి 56 మంది, టీచర్స్ స్థానానికి 15, వరంగల్-ఖమ్మం-నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి 19 మంది పోటీలో ఉన్నారు. ఈనెల 27న పోలింగ్ జరగనుంది.