News May 24, 2024

ట్రెండింగ్‌లో #RCB FINISHED DHOBI

image

CSK, RCB సపోర్టర్ల మధ్య ట్వీట్స్ వార్ నడుస్తోంది. CSK స్టార్ మహేంద్ర సింగ్ ధోనీపై విమర్శలు చేస్తూ.. #RCB FINISHED DHOBI అని RCB ఫ్యాన్స్, #CSK BAAP OF RCB అని CSK ఫ్యాన్స్ ట్వీట్స్ చేస్తున్నారు. దీంతో ఈ హాష్‌ట్యాగ్స్ ట్రెండ్ అవుతున్నాయి. ఎలిమినేటర్ మ్యాచ్‌లో RCB ఓడిపోవడంపై CSK ఫ్యాన్స్ ట్రోల్ చేయడంతో ఈ వార్ మొదలైంది. విమర్శించుకోవడం ఆపాలని, ఇద్దరూ టీమ్ఇండియా స్టార్స్ అని నెటిజన్లు సూచిస్తున్నారు.

Similar News

News January 13, 2026

ప్రభాస్ నన్ను వర్రీ కావద్దన్నారు: మారుతి

image

రాజాసాబ్ రిజల్ట్ విషయంలో ప్రభాస్ తనకు సపోర్ట్‌గా నిలిచినట్లు డైరెక్టర్ మారుతి తెలిపారు. ‘మూవీ గురించి ఎక్కువ అప్డేట్‌గా ఉన్నది ప్రభాసే. నిరంతరం నాతో టచ్‌లో ఉన్నారు. వర్రీ కావద్దన్నారు. కొత్త ప్రయత్నం చేశాం. ఆడియెన్స్‌కు చేరడానికి కొంత టైమ్ పడుతుందన్నారు. రీసెంట్‌గా ఓల్డ్ గెటప్ సీన్స్ యాడ్ చేశాక ఆయనకు మెసేజ్ చేశా. ఆ సీన్స్ అన్నీ పర్ఫెక్ట్‌గా సెట్ అయ్యాయని అన్నారు’ అని మీడియా సమావేశంలో తెలిపారు.

News January 13, 2026

వైద్య శాఖకు ₹567 కోట్ల కేంద్ర నిధులు: మంత్రి

image

AP: రాష్ట్ర వైద్య శాఖకు కేంద్రం ₹567 కోట్లు విడుదల చేసిందని మంత్రి సత్యకుమార్ తెలిపారు. 15వ ఆర్థిక సంఘం కింద ఇచ్చే ₹2600 కోట్లలో ఇవి చివరి విడత నిధులన్నారు. PHC భవనాలు, డయాగ్నొస్టిక్ పరికరాలు, ఇతర అభివృద్ధి పనులకు వీటిని వినియోగిస్తారు. కాగా FY25-26 నిధులు, ఖర్చుపై మంత్రి సమీక్షించారు. కేంద్ర నిధులను పూర్తిగా సాధించాలని అధికారులను ఆదేశించారు. విఫలమైతే సంబంధిత అధికారులే బాధ్యులని స్పష్టం చేశారు.

News January 13, 2026

విజయ్‌కు మరోసారి CBI నోటీసులు

image

కరూర్ తొక్కిసలాట ఘటనలో TVK పార్టీ అధినేత విజయ్‌కు <<18836427>>సీబీఐ<<>> మరోసారి నోటీసులు ఇచ్చింది. ఈనెల 19న విచారణకు రావాలని ఆదేశించింది. కాగా నిన్న విజయ్‌ను సీబీఐ 7 గంటల పాటు ప్రశ్నించింది. గతేడాది జరిగిన ఆ తొక్కిసలాటలో 41 మంది మరణించగా, 60 మందికి పైగా గాయాలయ్యాయి.