News May 24, 2024

ట్రెండింగ్‌లో #RCB FINISHED DHOBI

image

CSK, RCB సపోర్టర్ల మధ్య ట్వీట్స్ వార్ నడుస్తోంది. CSK స్టార్ మహేంద్ర సింగ్ ధోనీపై విమర్శలు చేస్తూ.. #RCB FINISHED DHOBI అని RCB ఫ్యాన్స్, #CSK BAAP OF RCB అని CSK ఫ్యాన్స్ ట్వీట్స్ చేస్తున్నారు. దీంతో ఈ హాష్‌ట్యాగ్స్ ట్రెండ్ అవుతున్నాయి. ఎలిమినేటర్ మ్యాచ్‌లో RCB ఓడిపోవడంపై CSK ఫ్యాన్స్ ట్రోల్ చేయడంతో ఈ వార్ మొదలైంది. విమర్శించుకోవడం ఆపాలని, ఇద్దరూ టీమ్ఇండియా స్టార్స్ అని నెటిజన్లు సూచిస్తున్నారు.

Similar News

News February 9, 2025

గిల్ ఉంటే రో‘హిట్’

image

ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ మరోసారి అద్భుత ప్రదర్శన చేశారు. ముఖ్యంగా వన్డేల్లో గిల్‌తో ఓపెనింగ్ చేసిన మ్యాచుల్లో హిట్ మ్యాన్ ఆకట్టుకునే ప్రదర్శన చేస్తున్నారు. గత ఎనిమిది ఇన్నింగ్సుల్లో 2 సార్లు సెంచరీ, 4 సార్లు అర్ధసెంచరీ భాగస్వామ్యం నెలకొల్పడం గమనార్హం. ఇవాళ్టి మ్యాచులో 100 బంతుల్లో 136 పరుగులు నమోదు చేశారు.

News February 9, 2025

ఢిల్లీ సీఎం ఎంపికపై బీజేపీ కసరత్తు

image

ఢిల్లీ సీఎం అభ్యర్థిని ఖరారు చేసేందుకు బీజేపీ అధిష్ఠానం కసరత్తు చేస్తోంది. ఈ విషయమై బీజేపీ చీఫ్ జేపీ నడ్డాతో కేంద్ర మంత్రి అమిత్ షా భేటీ అయ్యారు. కేజ్రీవాల్‌ను ఓడించిన పర్వేశ్ వర్మ, మంజీందర్ సింగ్, ఆశిష్ సూద్‌తో వీరు సమావేశమయ్యారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఒడిశా సీఎం ఎంపికలో రచించిన వ్యూహాన్ని అనుసరించే అవకాశమున్నట్లు సమాచారం.

News February 9, 2025

శర్వానంద్ మూవీకి పవన్ కళ్యాణ్ టైటిల్?

image

శర్వానంద్ హీరోగా ‘SHARWA36’ అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న మూవీపై ఓ క్రేజీ రూమర్ వైరల్‌గా మారింది. ఈ చిత్రానికి పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘జానీ’ టైటిల్ ఫిక్స్ చేసినట్లు టాక్. ఈ మూవీలో శర్వానంద్ బైక్ రేసర్‌గా కనిపిస్తారని సమాచారం. అభిలాష్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ బ్యానర్ తెరకెక్కిస్తోంది. కాగా జానీ మూవీ 2003లో విడుదలై అనుకున్న స్థాయిలో విజయం సాధించలేదు.

error: Content is protected !!